సమీక్ష : ‘స్కైల్యాబ్’ – స్లోగా సాగే బోరింగ్ డ్రామా !

SkylabMovie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 04, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి తదితరులు

దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు

నిర్మాతలు: నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు

సంగీత దర్శకుడు: ప్రశాంత్ విహారి

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘స్కైల్యాబ్’. డాక్టర్ కే. రవి కిరణ్ సమర్పణ లో పృథ్వీ పిన్నమ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతమైన బండలింగంపల్లిలో ఈ కథ జరుగుతుంది. ఆ గ్రామంలో గౌరి (నిత్య మీనన్) ఒక జమీందార్ కుమార్తె. గౌరి ప్రతిబింబం అనే పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. ఆమె ఎప్పటికైనా రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. ఇక గౌరి కథకు సమాంతరంగా డాక్టర్ ఆనంద్ (సత్య దేవ్) గౌరి గ్రామంలోనే క్లినిక్ పెట్టి డబ్బు సంపాదించడం కోసం సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ)తో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు ఏమిటి ? వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? గౌరి రచయిత్రిగా పేరు తెచ్చుకుందా ? లేదా ?, ఇక డబ్బు కోసం వచ్చిన డాక్టర్ ఆనంద్ లో ఎలాంటి మార్పు వచ్చింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని మెయిన్ పాయింట్, అలాగే ఈ కథ జరిగిన నేపథ్యమే. దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు రాసుకున్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు కొన్నో చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ప్రధానంగా ఓ చిన్న గ్రామంలోని ప్రజలలో ఉండే అమాయకత్వం సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయాన్ని నిత్య మీనన్ చక్కగా పలికించింది. డాక్టర్ గా సత్య దేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. నటి తులసి తల్లి పాత్రలో చక్కని టైమింగ్ తో అలరించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అన్నిటికీ మించి కథ లోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదు అనిపించినా దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు , కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా స్కై ల్యాబ్ అనే పాయింట్ చుట్టూ కథను నడుపుతూ కూడా దర్శకుడు కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ సింగిల్ ప్లాట్ తోనే ప్లేను చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు.

 

దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగుతాయి. అయినా ఏ పాత్ర ఎందుకు వస్తోంది ?అసలు ఆ పాత్రల తాలూకు బాధ, ఆలోచనా విధానం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే, జరుగుతున్న కథలో ప్రేక్షకుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు ? అందుకే ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ కి ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ కాలేదు.

 

పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడం కూడా ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పించదు. అదేవిధంగా 1970 నాటి తెలంగాణ నేపథ్యాన్ని కూడా సినిమాలో ఎలివేట్ చేయలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

విశ్వక్‌ ఖండేరావు దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. అలాగే రచయితగా కూడా ఆయన ఏ మాత్రం తన కథనంతో ఆకట్టుకోలేదు. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫర్ ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాతలు నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

 

తీర్పు :

1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందనే విభిన్న కథాంశంతో వచ్చిన ఈ ‘స్కైలాబ్‌’ చిత్రం ఆకట్టుకోలేదు. డిఫరెంట్ సినిమాగా కొన్ని అంశాల్లో ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, సినిమాలో బోరింగ్ ట్రీట్మెంట్ ఎక్కువవడం, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :