ఓటిటి సమీక్ష : “దహద్” – హిందీ సిరీస్ ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష : “దహద్” – హిందీ సిరీస్ ప్రైమ్ వీడియోలో

Published on May 16, 2023 4:01 PM IST
Dahaad Hindi Movie Review In Telugu

విడుదల తేదీ : మే 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: సోనాక్షి సిన్హా, విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య, సోహుమ్ షా, జోవా మొరానీ, మిఖాయిల్ గాంధీ, జయతి భాటియా, మన్యు దోషి, యోగి సింఘా, సంఘమిత్ర హితైషి, రాజీవ్ కుమార్

దర్శకులు : రీమా కగ్టి, రుచిక ఒబెరాయ్

నిర్మాతలు: ఎక్సెల్ మీడియా & టైగర్ బేబీ

సంగీత దర్శకులు: గౌరవ్ రైనా, తరానా మార్వా

సినిమాటోగ్రాఫర్: తనయ్ సతమ్

ఎడిటర్: ఆనంద్ సుబయ

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా ఓటిటి లో వచ్చినటువంటి వెబ్ సిరీస్ లలో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన హిందీ సిరీస్ “దహద్” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించిన ఈ సిరీస్ హిందీ సహా పలు ఇతర ఇండియన్ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఓటిటి వీక్షకులని ఆకట్టుకుంటుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..ఈ సిరీస్ రాజస్థాన్ లో సెటప్ చేయగా అక్కడ ఓ సీరియల్ కిల్లర్ కేవలం మహిళలని మాత్రమే టార్గెట్ చేసి వారు చంపుతూ ఆ మర్డర్స్ ని వారి ఆత్మహత్యాల్లా చిత్రీకరిస్తూ ఉంటాడు. ఇలా చంపుతూ డెడ్ బాడీస్ ని పబ్లిక్ టాయిలెట్స్ లో వదులుతూ ఉండే ఈ పరిణామాలు అక్కడి పోలీస్ వారికి ఛాలెంజ్ లా అయితే మారుతుంది. ఇక ఈ కేసులో అంజలి భాటి(సోనాక్షి సిన్హా) ఇన్స్పెక్టర్ గా అయితే ఎంటర్ అవుతుంది. మరి ఈమె ఈ మిస్టీరియస్ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఈమె కూడా మహిళ కాబట్టి ఆమెని కూడా ఆ కిల్లర్ టార్గెట్ చేస్తాడా? అసలు చివరికి ఏమవుతుంది? ఆ కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు అనే ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ తరహా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లలో అయితే ఆడియెన్స్ కి థ్రిల్ చేయడం అంత సింపుల్ విషయం అయితే కాదు. అందులోని ముందే కిల్లర్ ఎవరు అనే అంశం రివీల్ చేసి లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్ గా నరేషన్ నడపడం అనేది మరో ఇంట్రెస్టింగ్ అంశం. అయితే ఈ అంశం తోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ లో నరేషన్ కనిపించడం విశేషం.

అలాగే ఈ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ విషయంలో చూపించిన పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆసక్తి రేపుతాయి. ముఖ్యంగా కిల్లర్ విషయంలో ఎందుకు పోలీస్ వాళ్ళు నిస్సహాయంగా ఉంటారు ఈ తరహా సన్నివేశాలు మంచి ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని సోషల్ ఎలిమెంట్స్, లాజిక్స్ కూడా ఈ సిరీస్ లో బాగున్నాయి. ఇక నటి సోనాక్షి సిన్హా అయితే సాలిడ్ డెబ్యూ ని ఈ సిరీస్ తో ఇచ్చింది అని చెప్పాలి.

పోలీస్ పాత్రలో మంచి పవర్ ఫుల్ గా కనిపిస్తూ మంచి నటనను కనబరిచింది. అలాగే ఆమె పెర్ఫామెన్స్ అయితే తన ఫ్యాన్స్ కి మరింత నచ్చుతుంది. ఇక మరో నటుడు విజయ్ వర్మ మంచి పాత్రలో కనిపించాడు. అలాగే గూళ్హన్ దేవయా, సోనుమ్ షా తదితరులు మంచి పాత్రల్లో కనిపించారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సిరీస్ లో మరీ అంత క్రూరమైన లేదా డిస్టబింగ్ సీన్స్ లేకపోవడం మంచి విషయం.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ లో మెయిన్ డ్రా బ్యాక్ ఏమన్నా ఉంది అంటే అది సిరీస్ నిడివి అని చెప్పాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ సిరీస్ అంత వరకు ఉండదు. 7 ఎపిసోడ్స్ గా కుదించి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ బాగా రిపీటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. దీనితో పలు చోట్ల బోర్ గా అనిపిస్తుంది. అలాగే సోనాక్షి పై లవ్ ట్రాక్ సీన్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

ఇంకా కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసేయాల్సింది. అయితే మరో మేజర్ డిజప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది క్లైమాక్స్ అని చెప్పాలి. ఈ క్లైమాక్స్ ని ఇంకా ఇంప్రెసివ్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కిల్లర్ వెనుక ఉన్న మోటో కూడా అంత అర్ధవంతంగా అనిపించదు. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఇంకా బెటర్ గా చేయాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. తరణా మార్వా సంగీతం బాగుంది. ముఖ్యంగా గ్రిప్పింగ్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్టీవ్ గా ఉంది. ఇక తనయ్ సినిమాటోగ్రఫీ, సిరీస్ థీమ్ కి తగ్గట్టుగా ఉంది. ఇక ఆనంద్ సుబయ ఎడిటింగ్ వర్క్ మాత్రం ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకులు రీమా, రుచిక విషయానికి వస్తే.. వారు ఇంప్రెసివ్ వర్క్ ని అందించారని చెప్పొచ్చు. పలు ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లను బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే వారు ఎంచుకున్న సోషల్ ఎలిమెంట్స్, నరేషన్ అంతా కూడా బాగుంది. అయితే క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “దహద్”. ఓటిటి వీక్షకలను ఆకట్టుకునే రీతిలోనే ఉందని చెప్పొచ్చు. సోనాక్షి సాలిడ్ ఓటిటి డెబ్యూ అలాగే ఆసక్తి అనిపించే థ్రిల్లింగ్ అంశాలు, గ్రిప్పింగ్ నరేషన్ అలాగే పలు సోషల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే క్లైమాక్స్ ని ఇంకా బాగా ఉంటే బాగుణ్ణు. ఇది మినహా ఈ వారాంతానికి మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకుంటే ఈ వారాంతానికి ప్రైమ్ వీడియో లో ఉన్న ఈ సిరీస్ ని ట్రై చెయ్యొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు