ఓటిటి సమీక్ష : తాప్సీ “హసీన్ దిల్ రూబా” – నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం

Published on Jul 3, 2021 2:01 pm IST
Haseen-Dillruba Movie Review

విడుదల తేదీ : జూలై 03,2021
123telugu.com Rating : 2.75/5

నటీనటులు : తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే
దర్శకుడు : వినిల్ మాథ్యూ
నిర్మాతలు : ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
సంగీతం : అమర్ మంగ్రుల్కర్
సినిమాటోగ్రఫీ : జయ కృష్ణ గుమ్మడి
ఎడిటింగ్ : శ్వేతా వెంకట్ మాథ్యూ

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం తాప్సి నటించిన “హసీన్ దిల్ రూబా” దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో తాజాగా విడుదల కాబడ్డ ఈ సిరీస్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి..

 

కథ :

 

ఇక ఈ చిత్రం కథలోకి వెళ్లినట్టయితే రాణి(తాప్సీ) అనే మిడిల్ క్లాస్ అమ్మాయి తన బ్రేకప్ జ్ఞ్యాపకాల తోనే రిషూ(విక్రాంత్ మాసే) తో వివాహం జరుపుకుంటుంది. ఆ తర్వాత కూడా వారి లైఫ్ లో మంచి మార్పులు ఉండవు. అయితే ఈ క్రమంలోనే రాణికి రిషూ కజిన్ నీల్(హర్షవర్ధన్) పరిచయం అవుతాడు. అక్కడ నుంచి వారి పరిచయం పెరిగి అఫైర్ వరకు వెళ్తుంది.. అలాగే మరోపక్క ఊహించని విధంగా రాణి భర్త రిషూ ఓ బ్లాస్ట్ లో మరణిస్తాడు. ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అతడు చనిపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళిద్దరి అక్రమ సంబంధం దీనికి కారణమా లేక వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం కనికా ధిలోన్ రచించిన అద్భుతమైన కథ ఆధారంగా తెరకెక్కింది.. మరి ఆ కథ అనుసారం తెరకెక్కించిన ఈ చిత్రంలో పలు అంశాలు మంచి ఆసక్తిభరితంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో మెయిన్ లీడ్ మధ్య కొన్ని ఎపిసోడ్స్ కానీ వారి నడుమ కెమిస్ట్రీ కానీ చాలా బాగుంటాయి.

అలాగే మంచి రోల్స్ ఎంచుకుంటూ వెళ్తున్న తాప్సీ కెరీర్ లో ఇదొకటి అని చెప్పొచ్చు సింపుల్ అండ్ నాచురల్ రోల్ లో మంచి నటనను తాను కనబరిచింది. అలాగే ఈ చిత్రంలో మరో మేజర్ హైలైట్ విక్రాంత్ ది అని చెప్పాలి. తాప్సీ భర్తగా కనిపించే ఆ రోల్ లో సూపర్బ్ గా చేసాడు. తనలోని కనిపించే ప్రతీ షేడ్ సాలిడ్ గా ఉంటుంది.

వీరితో పాటుగా హర్షవర్ధన్ రానే రోల్ కూడా బాగుంది తన రోల్ కి మంచి న్యాయం చేకూర్చాడు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే క్లైమాక్స్ పార్ట్ అని చెప్పాలి. చివరి 20 నిమిషాల్లో గ్రిప్పింగ్ నరేషన్ కానీ ట్విస్టులు కానీ సూపర్బ్ గా ఉంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కనిపించే థీమ్ బాగానే ఉంటుంది కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఓవరాల్ గా సోసో గానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ ఇన్వెస్టిగేషన్ చుట్టూతా తిరుగుతుంది కానీ అదే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ డ్రా బ్యాక్ లా అనిపిస్తుంది. ఎక్కడా లాజికల్ పొంతన కనిపించదు.

సో అవన్నీ సిల్లీ గా కొన్ని సార్లు ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే మొదటి నుంచీ నరేషన్ కూడా పెద్దగా గ్రిప్పింగ్ గా ఉండదు ఏదో అలా కొనసాగుతుంది. దీనితో ఒకింత పలు చోట్ల బోర్ అనిపిస్తుంది. తాప్సీ రోల్ కూడా అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపించదు. దీని మూలాన చూసే వారికి ఆమె రోల్ కాస్త కన్ఫ్యూజన్ ని కలిగించేలా అనిపిస్తుంది.

అలాగే జస్ట్ కొన్ని సన్నివేశాలు మినహా మిగతా డ్రామా అంతా ఆల్రెడీ చూసినట్టే రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది. మరికొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో సాంకేతిక విలువలు మాత్రం చాలా బాగుంటాయి. టెక్నీకల్ టీం విషయానికి వస్తే కెమెరా వర్క్ లో మంచి లొకేషన్స్ ని చూపించారు. అలాగే డైలాగ్స్, మ్యూజిక్ బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే లా అనిపిస్తుంది. ఎడిటింగ్ లో ఇంకొంత సినిమా తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు వినీల్ విషయానికి వస్తే ఓవరాల్ గా ఓకే అని చెప్పొచ్చు. పలు సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా డీల్ చేసినా ఇన్వెస్టిగేషన్ సీన్స్ ని ఫ్యామిలీ డ్రామాని ఇంకా మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ “హసీన్ దిల్ రూబా” లో థీమ్ బాగుంటుంది అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ లు కూడా ప్రామిసింగ్ గా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు సహా లాస్ట్ 20 నిముషాలు అలా మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ దర్శకుడు ఇంకా బెటర్ గా ఈ చిత్రంలో కొన్ని కీలక ఎపిసోడ్స్ ని డీల్ చేసి ఉంటే మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఆ మైనస్ పాయింట్స్ పక్కన పెడితే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :