సమీక్ష : “థోర్ లవ్ అండ్ థండర్” – ఆకట్టుకునే విజువల్ డ్రామా

సమీక్ష : “థోర్ లవ్ అండ్ థండర్” – ఆకట్టుకునే విజువల్ డ్రామా

Published on Jul 8, 2022 3:01 AM IST
Thor: Love and Thunder Movie Review

విడుదల తేదీ : జూలై 7, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: క్రిస్ హేమ్స్‌వర్త్, క్రిస్టియన్ బేల్, నటాలీ పోర్ట్‌మన్, టెస్సా థాంప్సన్, జైమీ అలెగ్జాండర్, వెయిటిటీ, రస్సెల్ క్రోవ్ తదితరులు.

దర్శకుడు: తైకా వెయిటిటి

నిర్మాతలు: కెవిన్ ఫీగే మరియు బ్రాడ్ విండర్‌బామ్

సంగీత దర్శకుడు : మైఖేల్ గియాచినో మరియు నామి మెలుమాడ్

సినిమాటోగ్రఫీ: బారీ ఇడోయిన్

ఎడిటర్ : మాథ్యూ ష్మిత్, పీటర్ ఎస్. ఇలియట్, టిమ్ రోచె మరియు జెన్నిఫర్ వెచియారెల్లో

హాలీవుడ్ సెన్సేషనల్ సంస్థ మార్వెల్స్ నుంచి ఫేజ్ 4 నుంచి ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో అవైటెడ్ చిత్రం “థోర్ లవ్ అండ్ థండర్” కూడా ఒకటి. మరి భారీ అంచనాల నడుమ ఒక రోజు ముందే మన దేశంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి..

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్లు అయితే.. థోర్ ఆడిన్ సన్(క్రిస్ హోమ్స్ వర్త్) మళ్లీ తన జీవితాన్ని సాఫీగా సాగిస్తుంటాడు. ఇక మరోపక్క ద గోర్ వరుసగా లోకంలో ఉన్న దేవుళ్ళని అంతం చేసుకుంటూ వెళ్తుండగా నెక్స్ట్ థోర్ తాలూకా న్యూ ఆస్ గార్డ్ ని టార్గెట్ చేస్తాడు. ఇక్కడి నుంచి కొంతమంది పిల్లలను అలాగే థోర్ సన్నిహితులను ఆ గోర్ కిడ్నాప్ చేస్తాడు. మరి ఇంతకీ ఈ గోర్ ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? తాను అపహరించిన పిల్లలు ఇతరులు ఎక్కడ ఉన్నారో తెలియాలి అంటే ఈ విజువల్ వండర్ ని థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మార్వెల్స్ నుంచి వచ్చే సినిమాల నుంచి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అందుకు తగ్గట్టే సాలిడ్ విజువల్ ట్రీట్ ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. అలాగే థోర్ సిరీస్ లో ఈ మధ్య కాస్త ఎక్కువ కనబడుతున్న కామెడీ ని మళ్లీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో డైరెక్టర్ తీసుకొచ్చి ఎంటర్టైన్ చేసాడు. గత రాగ్నోరాక్ సినిమాలో ఎలా అయితే మంచి ఫన్ ఉందో ఈ సినిమాలో కూడా బాగానే కనిపిస్తుంది.

ఇక మెయిన్ హీరో క్రిస్ విషయానికి థోర్ గా ఈ సినిమాలో కాస్త ఎక్కువే కష్టపడాల్సి వచ్చిందని చెప్పాలి. తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ నుంచీ భారీ యాక్షన్ సన్నివేశాల్లో తాను అదరగొట్టాడు. అంతే కాకుండా తన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో కూడా ఆకట్టుకుంటాడు. ఇంకా ఈ చిత్రంలో అంతా ఆసక్తి గా ఎదురు చూసింది బ్యాట్ మెన్ ఫేమ్ క్రిస్టియన్ బెల్ చేసిన విలన్ రోల్ కోసం. ఈ స్టన్నింగ్ భయానక పాత్రలో తాను సినిమాలో మరో హైలైట్ గా నిలిచాడు.

తన లుక్ గాని నటన గాని సినిమాలో వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే మరో సర్ప్రైజింగ్ ప్యాక్ అయినటువంటి నటాలియన్ తన రోల్ లో సాలిడ్ యాక్షన్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టింది. అలాగే 3డి లో ఈ చిత్రంలో కనిపించే గ్రాండ్ విజువల్స్ అన్నీ అత్యద్భుతంగా కనిపిస్తాయి. అందులో సందేహం లేదు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సిరీస్ కో ఎంటర్టైన్మెంట్ పాళ్లు కాస్త ఎక్కువ అవ్వడంతో అన్ని సెక్షన్ల ఆడియెన్స్ లో ఆ అంచనాలు కాస్త ఎక్కువే పెట్టుకొనే ఉంటారు. అయితే వారికి కాస్త ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్మెంట్ తప్పదని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో మాంచి ఫన్ ని జెనరేట్ చెయ్యడానికి స్కోప్ ఉన్నా కూడా అది మాత్రం వినియోగించుకోలేదు.

ఇంకా మార్వెల్ సిరీస్ లలో ఒక సినిమా నుంచి ఇంకో సినిమా టైం లైన్ వారు కనిపించడం ఎప్పుడూ మాంచి ఆసక్తి గా ఉంటుంది. అలా ఈ సినిమాలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వారు కూడా కనిపించారు కానీ స్క్రీన్ స్పేస్ మరింత కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

నిర్మాణ విలువలు విషయంలో మార్వెల్ వారి కేర్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాకి కూడా అత్యున్నతంగా ఉన్నాయి. ఇక టెక్నికల్ టీం లో అయితే బారీ సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అలాగే మైఖేల్ మరియు నమీ ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని ఎక్కడికక్కడ ఎలివేట్ చేశారు. ఇంకా ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే సినిమా టోటల్ వి ఎఫ్ ఎక్స్ చాలా గ్రాండ్ గా కొత్తగా ఉన్నాయి.

ఇక దర్శకుడు టకీయా వైటిటి లాస్ట్ టైం తీసిన రాగ్నో రాక్ కి ఎలా అయితే సాలిడ్ జాబ్ అందించారో ఈసారి కూడా మంచి వర్క్ ఈ ప్రీ క్వెల్ కి అందించారని చెప్పాలి. స్టోరీ ని, క్యారెక్టర్ లను చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్ గా ఉంది. కాకపోతే ఇంకా చాలా సీన్స్ లో మరింత ఎంటర్టైన్మెంట్ ని జోడించి వుంటే బాగుండేది. ఇలా చిన్న చిన్న అంశాలు తప్ప వేరే ఫ్లాస్ ఎక్కడా ఉండవు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “థోర్ లవ్ అండ్ థండర్” గ్రాండ్ విజువల్స్ తో అలాగే మెయిన్ లీడ్ ల సాలిడ్ పెర్ఫార్మెన్సు లతో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అలాగే సినిమాలో కామెడీ, ఎమోషన్స్ సహా లవ్ వంటి అంశాలు ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. ఇక అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే ఈ వారాంతంలో ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు