ఓటిటి సమీక్ష: తుఫాన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో

Published on Jul 16, 2021 10:10 pm IST
Toofan Hindi film on Amazon Prime review

విడుదల తేదీ : జూలై 16,2021
123telugu.com Rating : 2.5/5

నటీనటులు : ఫర్హాన్ అక్తర్, పరేష్ రావల్, మృణల్ ఠాకూర్, విజయ్ రాజ్
దర్శకుడు : రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా
నిర్మాతలు : రితేష్ సిధ్వని, ఫర్హాన్ అక్తర్
సంగీత దర్శకుడు : శంకర్ ఈశాన్ లాయ్


ఓటిటి లో సమీక్షలు మరియు ప్రదర్శనలను కొనసాగిస్తూ, నేటి సమీక్ష హిందీ చిత్రం అయిన తుఫాన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. అది ఎలా ఉందో చూద్దాం రండి.

కథ:
అజీజ్ అలీ (ఫర్హాన్ అక్తర్) ఈ చిత్రం లో ముంబై లోని డొంగ్రి అనే ప్రాంతం లో ఒక చిన్న గ్యాంగ్ స్టర్. అతని స్నేహితుడు ద్వారా బాక్సింగ్ పట్ల ఆకర్షణ కి గురి అవుతాడు, తద్వారా తను కూడా బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటాడు. అయితే బాక్సింగ్ ప్రపంచం లోకి రావాలంటే ముస్లిం ల పట్ల ద్వేషం ఉన్న కోచ్ ప్రభు (పరేష్ రావల్) ఆశీర్వాదం అవసరం. అయితే అజీజ్ అలీ ప్రభు ను ఎలా ఒప్పించాడు, అతను ఈ బాక్సింగ్ ప్రయాణం లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్:

ఫర్హాన్ అక్తర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం లో అతను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ఈ చిత్రం చూస్తే తెలుస్తోంది. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో, చాలా బాగా చేశారు అని చెప్పాలి. అయితే ఈ చిత్రం లో ఫర్హాన్ లుక్ చాలా బావుంది.

మృనాల్ ఠాకూర్ ఫర్హాన్ ల ప్రేమ చాలా ఆసక్తికరం గా ఉంటుంది. ఈ చిత్రం లో తన నటన చాలా కూల్ గా అధ్బుతంగా ఉందని చెప్పాలి. బాక్సింగ్ నేపథ్యం లో ఉన్న చిత్రం కావడం, ట్రైనింగ్ ను కూడా చూపించడం వంటి కారణంగా కాస్త నెమ్మదిగా అనిపించినా చాలా బావున్నాయి.

ఈ చిత్రం లో పరేష్ రావల్ నటన అద్భుతం. కోచ్ గా నటించిన పరేష్ పాత్రలో చాలా డెప్త్ గా ఒదిగి పోయాడు. అయితే బాక్సింగ్ పోటీల కంటే పలు సన్నివేశాల్లో ఫర్హాన్ తో ఉన్నటువంటి సంభాషణలు చాలా కీలకం గా ఉన్నాయి. ఈ సినిమా లో పరేష్ రావల్ పాత్ర అత్యంత కీలకం అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

తుఫాన్ అనే చిత్రం లో మొదటి సన్నివేశం నుండి చాలా రొటీన్ గా సాగుతుంది అని చెప్పాలి. అంతేకాక బాక్సింగ్ నేపథ్యం లో ఇప్పటికే ఇండియన్ సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఈ చిత్రం లో అంత కొత్తదనం ఏమీ లేదని చెప్పాలి. అంతేకాక స్పోర్ట్స్ డ్రామా గా అంతగా ఆకట్టుకోదు అని చెప్పాలి.

అయితే సినిమా సెటప్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ బాక్సర్ గా సాగించే పోరాటం రొటీన్ గా ఉంటుంది. అయితే తర్వాత ఏ సన్నివేశాలు వస్తాయో కూడా ముందే అర్దం అయ్యేలా కొన్ని సన్నివేశాలు పునరావృతం అవుతాయి. ఈ చిత్రం లో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పిన విధంగా సన్నివేశాలు ఉంటాయి. కొత్తదనం ఏమీ లేదని చెప్పాలి.

అయితే భావోద్వేగ సన్నివేశాలు చాలా బావున్నా, వాటి ప్రభావం అంతగా ఉండదు అని చెప్పాలి. ఈ చిత్రం లెంగ్త్ కూడా ఎక్కువ గా ఉండటం స్పోర్ట్స్ డ్రామా కి సరిపడదు అని చెప్పాలి. అంతేకాక అసలైన కథలోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది.

సాంకేతిక విభాగం:

ఈ చిత్రం యొక్క నిర్మాణ విలువలు అత్యుత్తమం గా ఉన్నాయి. కెమెరా వర్క్ ఈ చిత్రం కి హైలెట్ అని చెప్పాలి. ముంబై లోని సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం అంతగా లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది అని చెప్పాలి. అయితే ముంబై భాష కోసం రాసిన డైలాగులు చాలా బావున్నాయి అని చెప్పాలి. కథ విషయం లో దర్శకుడు చాలా స్పష్టత ఉంచినప్పటికీ, కథనం అంతగా ప్రభావం చూపదు అని చెప్పాలి.

తీర్పు:

మొత్తం మీద తుఫాన్ చిత్రం ఒక బాక్సింగ్ డ్రామా.ఇందుకు ముందుగా ఊహించే సన్నివేశాలు, బాక్సింగ్ సన్నివేశాలు ఉంటాయి. అయితే ఫర్హాన్ అక్తర్ తన అత్యుత్తమ నటన మాత్రమే కాకుండా శరీరాకృటి కోసం కష్టపడిన విధానం బావుంది అని చెప్పాలి. అయితే భావోద్వేగాలతో వచ్చే సన్నివేశాలు బావున్నప్పటికి కథ పాత ది కావడం తో అంతగా ఆకట్టుకోదు అని చెప్పాలి. అయితే ఇది అంతగా ఆకట్టుకోదు అని చెప్పాలి, ఈ వారాంతం ఒక డల్ సినిమా అని చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :