సమీక్ష : “వారసుడు” – అక్కడక్కడా మెప్పించే ఫ్యామిలీ డ్రామా

సమీక్ష : “వారసుడు” – అక్కడక్కడా మెప్పించే ఫ్యామిలీ డ్రామా

Published on Jan 15, 2023 3:05 AM IST
Vaarasudu Movie-Review-In-Telugu

విడుదల తేదీ : జనవరి 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విజయ్, రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, జయసుధ, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సుమన్, శరత్‌కుమార్, ప్రభు, సంగీత మరియు ఇతరులు

దర్శకుడు : వంశీ పైడిపల్లి

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హర్షిత

సంగీత దర్శకులు: థమన్

సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని

ఎడిటర్: ప్రవీణ్ కెఎల్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సహా తమిళ్ లో మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన చిత్రాల్లో ఈరోజు వచ్చిన చిత్రం “వారసుడు” కూడా ఒకటి. ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఎంతో మంది అగ్ర తారాగణం నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే తెలుగు ఆడియెన్స్ ని ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే.. రాజేంద్ర(శరత్ కుమార్) ఓ బిజినెస్ మెన్ కాగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే తన వారసులు అయినటువంటి శామ్, శ్రీకాంత్ లకు ఇవ్వాలని అనుకుంటాడు. మరి వారితో పాటుగా తనకి ఉన్న మూడో వారసుడే విజయ్ రాజేంద్ర(విజయ్ జోసెఫ్). అయితే తాను తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంది లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. కాగా ఈ క్రమంలో ఎంతో ఆప్యాయంగా ఉండే తమ కుటుంబం ముక్కలవుతుంది తన తండ్రి సమస్యల్లో ఉన్నారు అనే సమయంలో విజయ్ ఓ స్టాండ్ తీసుకుంటాడు. ఇక అక్కడ నుంచి విజయ్ తన కుటుంబం కోసం ఏం చేస్తాడు? ఈ క్రమంలో రష్మికా పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో విజయ్ ని సరికొత్తగా మనం చూడవచ్చు తన మార్క్ ఈజ్ అండ్ స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తాయి కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రెజెంటేషన్ లో విజయ్ సాలిడ్ ప్రెజెన్స్ తో కనిపిస్తాడు. అలాగే తన సింగిల్ లైన్ డైలాగ్స్ బాగా పేలుతాయి. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. వీటితో పాటుగా మెయిన్ గా పలు ఎమోషనల్ సన్నివేశాల్లో విజయ్ జీవించాడు. ఇక సాంగ్స్ లో తన ఎనర్జీ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుంది.

అలాగే ఈ చిత్రంలో పలు చోట్ల కనిపించే సెన్సిబుల్ ఎమోషన్స్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి. అలాగే పాటలు కూడా మంచి సందర్భాల్లో కనిపిస్తాయి. విజయ్ పై పలు ఎలివేషన్ సీన్స్ మంచి కేజ్రీగా ఉంటాయి. ఇక సినిమాలో మరో హైలైట్ అందులోని బాగా వర్కవుట్ అయ్యింది ఏదన్నా ఉంది అంటే అది విజయ్ మరియు యోగిబాబు ల కామెడి సీన్స్ అని చెప్పాలి.

వీరి మధ్య ప్రతి ట్రాక్ సినిమాలో హిలేరియస్ గా ఉంటుంది. ఇక విజయ్ తో పాటుగా సినిమాలో కనిపించిన అగ్ర తారాగణం శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శామ్ ఎస్ జె సూర్య, సంగీత లాంటి నటులు తమ పాత్రల్లో సమాన ప్రాముఖ్యత తో మంచి నటన కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో బాగా డిజప్పాయింట్ చేసే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా నిడివే అని చెప్పాలి. సినిమాలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఆద్యంతం ఆకట్టుకునే ఎంగేజింగ్ కథనం కూడా లేకపోవడం కూడా అని చెప్పాలి. దీనితో చాలా సన్నివేశాలు బోర్ గా అనిపిస్తాయి.

అక్కడక్కడా కొన్ని చోట్ల ఓకే తప్ప మిగతా సినిమా అంతా సో సో గానే అనిపిస్తుంది. ఇక సినిమాలో కథ కూడా అంత కొత్తగా ఏమీ అనిపించదు. అనేక సినిమాల్లో చూసినట్టే రొటీన్ గానే ఉంటుంది. అలాగే సినిమాలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ లాంటి పాత్ర కూడా మరింత బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

అలాగే హీరోయిన్ రష్మికా కి కూడా సినిమాలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అక్కడక్కడా సీన్స్ పాటలు మినహా ఆమె పాత్ర సినిమాలో ఉపయోగం లేదు. అలాగే మరికొన్ని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే అనేక చోట్ల విజువల్స్ అంత నాచురల్ గా కూడా అనిపించవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంటాయి. దిల్ రాజు కాంప్రమైజ్ కాలేదు కానీ సాంకేతిక వర్గంలో వి ఎఫ్ ఎక్స్ టీం పై ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది. అలాగే థమన్ తన లోని బెస్ట్ వర్క్ కి మరోసారి అందించాడు. చాలా సీన్స్ కానీ పాటలు కానీ విజువల్ గా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ఎడిటింగ్ మాత్రం బాగాలేదు. చాలా సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.

ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి విషయానికి వస్తే.. తాను కాస్త రొటీన్ డ్రామానే ఎంచుకున్నా కాస్త ఎంటర్టైనింగ్ నరేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇది పూర్తి స్థాయిలో క్లిక్ అయ్యినట్టు అనిపించదు. కొన్ని ఎమోషన్స్ సహా విజయ్ పై తాను ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. కానీ నిడివి తగ్గించి నరేషన్ ని ఇంకా బాగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్ను.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “వారసుడు” లో దళపతి విజయ్ అన్ని కోణాల్లో ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని చోట్ల ఎమోషన్స్ కామెడీ వర్కవుట్ అవుతాయి. కానీ సినిమాలో నిడివి పెద్ద సమస్య అని చెప్పాలి. చాలా అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఇవి పక్కన పెడితే ఈ ఫ్యామిలీ డ్రామా ఈ పండుగలో ఓ మోస్తరు ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు