సమీక్ష : మసాలా ఎక్కువై మ్యాటర్ తగ్గిన వీడింతే

సమీక్ష : మసాలా ఎక్కువై మ్యాటర్ తగ్గిన వీడింతే

Published on Dec 31, 2011 1:55 AM IST
విడుదల తేది :30 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2/5
డైరెక్టర్ : సుసీన్ద్రన్
ప్రొడ్యూసర్ : ప్రతీష్, సంతోష్
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
నటీ నటులు: విక్రమ్, దీక్ష సెత్ , కే.విశ్వనాధ్ ,

‘చియాన్’ విక్రమ్ మరియు దీక్షా సేథ్ జంటగా నటించిన చిత్రం ‘వీడింతే’. ఈ చిత్రం తమిళంలో వచ్చిన ‘రాజపట్టై’ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్. సుసీన్ద్రన్ డైరెక్ట్ ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. వీడింతే చిత్రం ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజే విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

వీడింతే చిత్ర కథ భూమిని కబ్జా చేసే వారి గురించి వారు చేసే దురాగతాలపై రూపొందింది. ఫైర్ శంకర్ (విక్రమ్) సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తుంటాడు. పెద్ద సినిమాలో విలన్ వేషం వేయాలని అతని కోరిక. అనుకోకుండా దక్షిణ మూర్తి (కె. విశ్వనాద్) గారిని కలిసిన శంకర్ దక్షిణ మూర్తి గారికి ఎవరు లేరని తెలుసుకుని తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. అసలు దక్షిణ మూర్తి గారు బాగా ధనవంతుడు. అతని కొడుకు (అవినాష్) దగ్గర ఉండలేక బైటికి వచ్చేస్తాడు. దక్షిణ మూర్తి గారికి ఉన్న భూమి కబ్జా చేస్తే ఆయన తని భార్య ఇద్దరు అనాదాశ్రమమంలో తల దాచుకుంటారు. ఆ భూమిని కబ్జా చేసింది పొలిటీషియన్ అక్క (సన) మరియు దక్షిణ మూర్తి కొడుకు. ఇది తెలుసుకున్న శంకర్ ఏం చేసాడన్నది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

విక్రమ్ ఫైట్ మాస్టర్ గా బాగానే చేసాడు. అతని బాడీ బాగా పెంచడం వల్ల ఫైట్ సన్నివేశాలు బాగా చేయగలిగాడు. చివర్లో విభిన్నమైన గెటప్ లలో తన నట విశ్వరూపం చూపించే ప్రయత్నం చేసాడు. దీక్షా సేథ్ అందంగా క్యూట్ గా ఉంది. ఆమెకి ఈ చిత్రంలో నటన చేయడానికి సరిపడా పాత్ర లేకపోవడం విచారకరం. కె. విశ్వనాద్ గారు చాలా బాగా చేసారు. ఎప్పుడు పెద్ద మనిషి తరహా పాత్రలు చేసే ఆయనను లవ్ గురు పాత్రలో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. పొలిటీషియన్ అక్క పాత్రలో నటించిన సన కూడా బాగానే చేసింది.

మైనస్ పాయింట్స్:

మంచి కథే అయినప్పటికీ మసాలా సినిమాలా తీసారు. సినిమా అంతా గందరగోలంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్ కు అందకుండా ఉంటాయి. సినిమాలో చాలా వరకు తమిళ అతి ఉండటం అది తెలుగు ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. హీరో స్నేహితులుగా ఉండే వాళ్ళంతా కూడా తమిళ నటులే కావడంతో కూడా తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. స్క్రీన్ప్లే అస్సలు బాగా లేకపోగా నేరేషన్ అయితే ఇంకా అస్సలు బాగా లేదు. ప్రదీప్ రావత్ రొటీన్ గా నటించాడు. సంగీతం ఇనేమకి పెద్ద మైనస్ గా మారింది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సరిగా చూపించాకపోగా ఆ ట్రాక్ కి సరైన ముగింపునివ్వలేకపోయాడు. దీక్ష సేథ్ పాత్రని సరిగా వాడుకోలేకపోయారు. సలోని ఐటెం గర్ల్ గా ఆకట్టుకోలేకపోయింది.

సాంకేతిక విభాగం:

సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఎడిటింగ్ పరవాలేదు. ఫైట్స్ అస్సలు బాగాలేకపోగా అరవ అతి స్టైల్ ఎక్కువైంది. డైలాగులు పరవలేదనిపించాగా సుసీన్ద్రన్ డైరెక్షన్ అస్సలు బాగా లేదు. భవిష్యత్తులో అతని నుండి ఇలాంటి సినిమాలు రావు అని ఆశిద్దాం.

తీర్పు:

వీడింతే మాస్ మసాల అంశాలతో తీసిన కమర్షియల్ సినిమా. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఎంటర్టైన్మెంట్ అంశాలు తక్కువగా ఉండి తమిళ నేటివిటీ అరవ అతి ఎక్కువైంది. సినిమాలో చెప్పుకోడానికి ఏమీ లేదు.

అనువాదం – అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 2/5

Veedinthe Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు