ఓటీటీ రివ్యూ : ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ – (సోనీ లివ్ లో ప్రసారం)

ఓటీటీ రివ్యూ : ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ – (సోనీ లివ్ లో ప్రసారం)

Published on Dec 25, 2021 3:05 AM IST
WWW Movie Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 24, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు

దర్శకత్వం : కె వి గుహన్

నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల

సంగీత దర్శకుడు: సైమన్‌ కె. కింగ్

సినిమాటోగ్రఫీ: కె వి గుహన్

ఎడిటింగ్‌: తమ్మిరాజు

ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా ‘సోనీ లివ్’లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

విశ్వ (అదిత్‌ అరుణ్) ఒక ఇల్లీగల్ హ్యాకర్. తన ఫ్రెండ్స్ తో హ్యాకింగ్‌ చేస్తూ మనీ సంపాదిస్తుంటాడు. అలాంటి అతని జీవితంలోకి మిత్ర ( శివాని రాజశేఖర్) వస్తుంది. విశ్వ, మిత్రతో ఘాడంగా ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలుచుకునే క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. విశ్వ అండ్ అతని టీమ్ గతంలో చేసిన ఓ హ్యాకింగ్‌ కారణంగా జీవితాన్ని కోల్పోయిన ఓ వ్యక్తి.. ‘విశ్వ – మిత్ర’ జీవితాలను ఎలా అతలాకుతలం చేశాడు ? అతని కారణంగా విశ్వ ఎలాంటి బాధలను అనుభవించాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ద‌ర్శ‌కుడు కేవి గుహన్ ఈ సినిమాతో సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌ లోని మ‌రో కోణాన్ని.. ముఖ్యంగా డిఫరెంట్ పాత్రల విపరీత భావోద్వేగాలను ట‌చ్ చేస్తూ ఈ సినిమాను బాగానే తెర‌కెక్కించారు. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పాత్రల్లోని వేరియేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోగా నటించిన అదిత్‌ అరుణ్ తన పాత్రలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా శివాని రాజశేఖర్‌ విలన్ చేతిలో చిక్కుకుని ఇబ్బంది పడే సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ గా నటించిన శివాని రాజశేఖర్‌ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. సినిమాలోనే కీలక పాత్రల్లో నటించిన సత్యం రాజేష్, ప్రియదర్శి కూడా బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కేవి గుహన్ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా.. ఆ ఐడియాకి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సెకండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. అయితే సినిమా నిడివి తక్కువ కావడంతో ప్రేక్షకుడు ఎక్కడా స్లో నేరేషన్ ఫీల్ అవ్వడు. కానీ కథలో వేగం మాత్రం అస్సలు లేదు.

ఇక హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సన్నివేశాలు అయితే టైం పాస్ కోసం పెట్టినట్టే ఉంటాయి తప్పితే.. ఎక్కడా కథను డ్రైవ్ చేయవు. పైగా కథలోని మెయిన్ ప్లాట్ చాలా పేలవంగా ఉంది. దానికి తోడూ లాజిక్స్ లేని సీన్స్ తో పండని సైకలాజికల్ ఇన్ బ్యాలెన్స్ తో కథనం మొత్తం నడిచింది. మొత్తానికి దర్శకుడు కథా కథనాలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే బాగుండేది. అలాగే ట్విస్ట్ లను, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిస్తే సినిమాకు ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. అయితే, ఎక్కువ ఇన్ డోర్ లొకేషన్స్ అయినప్పటికీ కొన్ని సీన్స్ ను బాగా తెరకెక్కించారు. ఇక ఎడిటింగ్ చాలా క్రిస్పీ గా ఉంది. ఎడిటింగ్ సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ సీన్స్ ను చాలా బాగా కట్ చేశారు. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ అంటూ వచ్చిన ఈ సైబర్ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అండ్ మెయిన్ పాయింట్ మరియు ప్రధాన పాత్రల భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. అయితే, స్టోరీకి తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ లేకపోవడం, లాజిక్స్ లేని సీన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమాలోని కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు