సమీక్ష : యమలీల 2 – కృష్ణారెడ్డి మార్క్ కామెడీ..

సమీక్ష : యమలీల 2 – కృష్ణారెడ్డి మార్క్ కామెడీ..

Published on Nov 28, 2014 7:41 PM IST
Yamaleela-2-review విడుదల తేదీ : 28 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ఎస్.వి కృష్ణారెడ్డి
నిర్మాత : క్రిష్వీ ఫిల్మ్స్
సంగీతం : ఎస్.వి కృష్ణారెడ్డి
నటీనటులు : కెవి సతీష్, దియా నికోలస్, డా. మోహన్ బాబు…


గతంలో కామెడీ మరియు ఫ్యామిలీ డ్రామా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన డైరెక్టర్ ఎస్.వి కృష్ణారెడ్డి. ఎస్.వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో అలీ హీరోగా చేసిన ‘యమలీల 2’ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఎస్.వి కృష్ణారెడ్డి కెవి సతీష్ ని హీరోగా పరిచయం చేస్తూ సూపర్ హిట్ మూవీ ‘యమలీల’కి సీక్వెల్ గా చేసిన సినిమా ‘యమలీల 2’. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు యముడి పాత్రలో కనిపించిన ఈ సినిమాతో దియా నికోలస్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తన సూపర్ హిట్ మూవీ యమలీల కి సీక్వెల్ గా చేసిన ఈ యమలీల 2 ఆడియన్స్ ని ఎంతవరకూ ఆకట్టుకుంది.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

‘యమలీల 2’ సినిమా కథ యమలోకంలో మొదలవుతుంది. యమధర్మరాజు (డా. మోహన్ బాబు), చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) కలిసి భూలోకాన్ని విజిట్ చెయ్యాలి అనుకోవడంతో ఈ చిత్ర అసలు కథ మొదలవుతుంది. వాళ్ళు భూలోకానికి రాగానే అనుకోకుండా చిత్రగుప్తుడు తన భవిష్యవాణి పుస్తకాన్ని పోగొట్టుకుంటాడు. ఆ బుక్ ఫైనల్ గా హీరో క్రిష్(సతీష్) చేతికి వెళుతుంది.

ఇప్పుడు క్రిష్ విహయానికి వస్తే.. క్రిష్ ఒక డాక్టర్, లుకేమియా వ్యాధితో బాధపడుతున్న తన మేనకోడలు లైఫ్ ని కాపాడే మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే సమయంలో అతనికి దొరికిన భవిష్యవాణి పుసతకంలో తన భవిష్యత్తు గురించి షాకింగ్ విషయం తెలుసుకుంటాడు. అదే టైంలో యముడు, చిత్రగుప్తుడు క్రిష్ నుంచి తమ బుక్ అపహరించాలని ప్లాన్ చేస్తారు. ఆ భవిష్యవాణి బుక్ ద్వారా క్రిష్ తెలుసుకున్న నిజం ఏమిటి.? చివరికి యముడు – చిత్రగుప్తుడు తమ భవిష్యవాణిని దక్కించుకున్నారా.? లేదా.? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. విజువల్స్ మరియు సినిమాలో రూపొందించిన గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మోహన్ బాబు సినిమాకు ఆయువుపట్టుగా నిలిచారు. యమధర్మ రాజు పాత్రలో చిరస్మరణీయ నటన ప్రదర్శించారు. ముఖ్యంగా బరువైన పౌరాణిక డైలాగులు చెప్పడంలో తన అనుభవాన్ని చూపారు. యముడి పాత్రలో డెప్త్ తీసుకువచ్చారు. హీరోగా పరిచయం అయిన కెవి సతీష్ తన తొలి సినిమాలో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. డాన్స్ మరియు ఫైట్స్ బాగా చేశాడు. పిల్లలతో కలసి సతీష్ నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.

చిత్రగుప్తుడి పాత్రలో బ్రహ్మానందం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ పార్ట్ బాగున్నాయి. మొదటి పాటలో సదా చాలా అందంగా ఉంది. ఆ పాటను అంతే అందంగా చిత్రీకరించారు.

ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాను లావిష్ గా తెరకెక్కించారు. ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ హర్షిత ఓజా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె క్యారెక్టర్ ను చక్కగా డిజైన్ చేశారు, కథలో బాగా సింక్ అయ్యింది.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ గా నిలిచింది. అలాగే సెకండ్ హాఫ్ లో సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా సరిగా కుదరలేదు. ప్రేక్షకులు ఊహించదగిన ట్విస్టులతో కథ పూర్తిగా సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కూడా పంజాబీ క్యారెక్టర్ల స్ఫూర్తితో రూపొందించిన కామెడీ ట్రాక్ బలవంతంగా ఇరికించినట్టు అర్ధం అవుతుంది.

సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథ అందరికీ అర్ధం తెలుస్తుంది. కథను ముందుకు తీసుకువెళ్ళడానికి సిల్లీ కామెడీ ట్రాక్స్ యాడ్ చేస్తూ కృష్ణారెడ్డి ఇప్పటికీ అదే ఓల్డ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో మోహన్ బాబు తన నటనతో సినిమాను నిలబెట్టడానికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్స్ బాగున్నాయి. మకుట టీం గ్రాఫిక్ వర్క్స్ ను అద్బుతం చేశారు. హిమాలయాలను అద్బుతంగా చూపించారు. సదా డాన్స్ చేసిన పాటలో గ్రాఫిక్స్ అద్బుతంగా ఉన్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం డీసెంట్ గా ఉంది, సినిమాకు న్యాయం చేకూర్చారు. మోహన్ బాబు, బ్రహ్మానందం పాత్రలకు రాసిన డైలాగ్స్ కామెడీ బాగా పండించాయి.

సెకండ్ హాఫ్ లో అనవసరమైన ఫైట్స్ మరియు సిల్లీ కామెడీ ట్రాక్ లు యాడ్ చేయడంతో అక్కడక్కడా దర్శకుడిగా కృష్ణారెడ్డి కొంచం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో కామెడీ సన్నివేశాలు కూడా 90వ దశకంలో సినిమాలను గుర్తుకు తెప్పిస్తాయి. సినిమాను బాగానే ప్రారంభించిన కృష్ణారెడ్డి తర్వాత లైన్ తప్పారు. చాలా సన్నివేశాలను ఎడిటింగ్ లో ఈజీగా కత్తిరించి వేయొచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు మరో మైనస్ గా నిలిచింది.

తీర్పు :

రొటీన్ ఎంటర్టైనర్ యమలీల 2 సినిమాతో తను ఇప్పటికీ 90లలో తీసిన సినిమాల ఫార్ములాకి ఫిక్స్ అయిపోయానని కిష్ణారెడ్డి నిరూపించారు. మోహన్ బాబు పెర్ఫార్మన్స్ మరియు ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కృష్ణారెడ్డి మార్క్ కామెడీ సినిమాలను ఇష్టపడేవారు, ఓల్డ్ రొటీన్ ఎంటర్టైనర్ అయినా పర్వాలేదు, మాకు కాస్త కామెడీ ఉంటే చాలు అని భావించే వారు ఈ సినిమాను చూడడానికి సరదగా ఓసారి వెళ్ళొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు