“క్రిష్ 4” పై ఫైనల్ గా సాలిడ్ క్లారిటీ వైరల్.!

“క్రిష్ 4” పై ఫైనల్ గా సాలిడ్ క్లారిటీ వైరల్.!

Published on May 2, 2024 11:00 AM IST

మన ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన సూపర్ హీరో జానర్ చిత్రాల్లో బాలీవుడ్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ ఫ్రాంచైజ్ చిత్రం “క్రిష్” సిరీస్ కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా తన తండ్రి రాకేష్ రోషన్ దర్శక సారథ్యం లోనే తెరకెక్కించిన ఈ పాత్రకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటిలోనో చాలా అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్, కంటెంట్ కానీ ఆశ్చర్యపరిచాయి. దీనితో క్రిష్ 4 ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే క్రిష్ 4 ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు కానీ దానిపై ఇప్పుడు వరకు ఎలాంటి ప్రోగ్రెస్ పెద్దగా కనిపించలేదు. ఈసారి కథ టైం ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది అన్నట్టుగా కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఫైనల్ గా ఓ సాలిడ్ క్లారిటీ సినిమాపై వచ్చింది. ఈ సినిమా నిలిచిపోలేదు తప్పకుండ ఉంది అని మళ్ళీ క్రిష్ తిరిగి రాబోతున్నాడు అని బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కన్ఫర్మ్ చేసాడు.

రీసెంట్ తన ట్వీట్ రిప్లై వైరల్ గా మారింది. అయితే సిద్ధార్థ్ (Siddharth Anand) హృతిక్ కాంబినేషన్ లో రీసెంట్ గా “ఫైటర్” (Fighter Movie) అనే హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మరి క్రిష్ 4 కి గాని తాను డైరెక్ట్ చేస్తాడా లాంటి హింట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవి పక్కన పెడితే క్రిష్ సిరీస్ ఫ్యాన్స్ కి మాత్రం ఇపుడు ఈ క్లారిటీ కాస్త ఊరటనిచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు