‘ఆగడు’ నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది – మహేష్ బాబు.

‘ఆగడు’ నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది – మహేష్ బాబు.

Published on Aug 31, 2014 10:25 AM IST

mahesh-babu

‘దూకుడు’ నా కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్. ‘ఆగడు’ మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అన్నారు మహేష్ బాబు. ‘దూకుడు’ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో మరోసారి మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘ఆగడు’. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో శనివారం సాయంత్రం పలువురు చిత్ర ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్లో విడుదల చేశారు. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, శ్యాం ప్రసాద్ రెడ్డిలతో పాటు పలువురు హాజరయ్యారు.

మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ కొత్తగా ఉంటాయి. శ్రీను వైట్ల ఏం చెప్పారో నేను అదే చేశాను. ఆయన్ను ఫాలో అయిపోయాను. సంగీత దర్శకుడిగా 50 సినిమాలు పూర్తి చేసుకున్న తమన్ కు కంగ్రాట్స్. సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నాం. రెండు వారాల ముందే పండుగ వస్తుంది అని అన్నారు. ఈ కార్ర్యక్రమంలో పాల్గొన్న అతిధులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో మహేష్ బాబు నటిస్తున్న 3వ సినిమా ‘ఆగడు’ కావడం విశేషం. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు