ఆరడుగుల బుల్లెట్ విడుదల తేదీ ఖరారు !

ఆరడుగుల బుల్లెట్ విడుదల తేదీ ఖరారు !

Published on May 27, 2017 2:49 PM IST


చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న గోపిచంద్ చిత్రం ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు విడుడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని జూన్ 9 న విడుదల చేయనున్నారు. బి. గోపాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.

వివిధ రకాల కారణాల వలన ఈ చిత్రం మూడేళ్లుగా సెట్స్ పైనే ఉంది.ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూన్ 9 న విడుదల చేయనున్నట్లు బి. గోపాల్ , గోపిచంద్ లు ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రం లో గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు