అల్లరోడి ‘జేమ్స్ బాండ్’ రిలీజ్ డేట్

అల్లరోడి ‘జేమ్స్ బాండ్’ రిలీజ్ డేట్

Published on Jun 30, 2015 8:29 AM IST

allari-naresh
బాండ్ ‘జేమ్స్ బాండ్’ అంటూ త్వరలో మనముందుకు రానున్నాడు టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఆ జేమ్స్ బాండ్ ని నేను కాదు నా పెళ్ళాం అంటున్నాడు మన అల్లరోడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’, ‘నేను కాదు, నా పెళ్ళాం’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ముందుగా ఈ సినిమాని జూన్ 26న రిలీజ్ చెయ్యాలనుకున్నా కుదరక పోవడంతో ఈ సినిమాని వాయిదా వేసారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు.

‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో సిస్టర్ పెట్టిన టార్చర్ తో మనల్ని నవ్వించిన అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తరహా భార్యతో వచ్చే ఇబ్బందుల ద్వారా మనల్ని నవ్వించనున్నాడు. అల్లరోడికి చుక్కలు చూపించే మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కాకుండా అల్లరి నరేష్ – కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాంబినేషన్ లో శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లరి నరేష్ కి 123తెలుగు.కామ్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు