మన టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫోటో కానీ తన ఎక్స్ ప్రెషన్ కానీ లేకుండా తెలుగులో ఒక నెటిజన్ కి గడవని రోజు లేదు అలా మీమ్ గాడ్ గా మారిపోయిన బ్రహ్మానందం రీసెంట్ గానే “కీడా కోలా” సినిమాలో కనిపించారు. అయితే తన వారసుడు రాజా గౌతమ్ టాలీవుడ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోగా అక్కడ నుంచి కాస్త తక్కువ సినిమాలే చేస్తూ వచ్చాడు.
మెయిన్ గా కంటెంట్ కోసమే ఇంత గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఓ సినిమా ఓకే చేసాడు. దీనిపై హాస్య నటుడు వెన్నెల కిషోర్ తో కలిసి ఒక ఆసక్తికర అనౌన్స్మెంట్ వీడియోని కూడా వారు చేశారు. ఇందులో గౌతమ్ చేయనున్న తదుపరి సినిమా ఏంటి దర్శకుడు నిర్మాతలు ఎవరు వంటివి యూనిక్ గా రివీల్ చేశారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్ వి ఎస్ నిఖిల్ తెరకెక్కించనుండగా మసూద బ్యానర్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే శాండిల్య పీసపాటి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ అనౌన్సమెంట్ వీడియోలో తన స్కోర్ మంచి రిఫ్రెషింగ్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ “బ్రహ్మ ఆనందం” అనే పేరు పెట్టడం గమనార్హం.
అలాగే ఇందులో నిజజీవితంలో తండ్రీకొడుకులు అయినటువంటి బ్రహ్మానందం, గౌతమ్ లు తాత మనవడు గా కనిపించనుండం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. వీటితో అయితే ప్రామిసింగ్ ట్రీట్ వీరి నుంచి వచ్చేలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి రెలీయే డేట్ ని కూడా అనౌన్స్ చేసేసారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 12న వస్తున్నట్టుగా తెలియజేసారు.