ఔట్ ఫుట్ చూసి సంబరపడిపోతున్న అల్లు శిరీష్ !

ఔట్ ఫుట్ చూసి సంబరపడిపోతున్న అల్లు శిరీష్ !

Published on Jul 23, 2017 6:48 PM IST


అల్లు శిరీష్ ఈ సంవత్సరం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెల 9వ తేదీన పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికేఒక షెడ్యూల్ ముగించుకుని రెండవ షెడ్యూల్ కు కూడా సిద్ధమవుతోంది. ఇక బి 57 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఔట్ ఫుట్ చాలా బాగా వస్తోందట.

ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన శిరీష్ ఆనంద్ తో వర్క్ చాలా బాగుందని, రెండవ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇకపోతే ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు మంచి ధరకు అమ్ముడైనట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ టైటిల్ కూడా వర్కింగ్ టైటిల్ మాదిరిగానే విభిన్నంగా ఉంటుందట. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శిరీష్ సరసన సురభి, శీరత్ కపూర్లు హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రీనివాస్ అవసరాల ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు