తెలుగు జాతి గర్వించే నిర్మాత రామానాయుడు – దాసరి

తెలుగు జాతి గర్వించే నిర్మాత రామానాయుడు – దాసరి

Published on Aug 16, 2014 4:04 PM IST

dasari-narayan-rao

50 సంవత్సరాల నా సినిమా కెరీర్లో 120 మంది నిర్మాతలతో పని చేశాను. 150 సినిమాలకు దర్శకత్వం వహించాను. ప్రతి ఆర్టిస్ట్, నిర్మాత ఇలా అందరికి నచ్చిన వ్యక్తి రామానాయుడు గారు. ఇండియాలో అన్ని భాషలలో సినిమాలు నిర్మించిన వ్యక్తి రామానాయుడు గారు. ఆయన మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి. సినిమాకు సంబంధించి ప్రతి విషయం దగ్గరుండి చూసుకునేవారు. ప్రస్తుత తరంలో ఇలాంటి నిర్మాతలు కరువయ్యారు. అని అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడుపై ఫిల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మూవీమొఘల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరయిన దాసరి పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని కృష్ణకు అందచేశారు.

వినాయకరావు నాపై పుస్తకాన్ని రచించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రామానాయుడు అన్నారు. నిర్మాతగా నాయుడు గారు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని కృష్ణ అన్నారు. భవిష్యత్ తరాలు ఉపయోగపడే, చరిత్రను తెలియజేసే ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలని కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్.నారాయణమూర్తి, ఎన్.శంకర్, బి.గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు