యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన స్కంద మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే రిలీజ్ అనంతరం ఈ మూవీ ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నారు రామ్. 2019లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది.
సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని మే 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆకట్టుకునే కథ కథనాలతో పాటు మ్యూజికల్ గా కూడా అలరించేలా డబుల్ ఇస్మార్ట్ విషయంలో దర్శకుడు పూరి ఎంతో జాగ్రత్తలు తీసుకున్నని అంటోంది టీమ్. కాగా డబుల్ ఇస్మార్ట్ మ్యూజికల్ అప్ డేట్ పై మేకర్స్ నుండి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.