రామ్ కొత్త చిత్రంలో ప్రణీత పాత్ర ఏంటంటే !

రామ్ కొత్త చిత్రంలో ప్రణీత పాత్ర ఏంటంటే !

Published on May 24, 2018 3:17 PM IST

హీరో రామ్ నటిస్తున్న’హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో బెంగుళూరు బ్యూటీ ప్రణీత ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ ఈ సినిమాలో తాను సాఫ్ట్ వెర్ ఉద్యోగిని పాత్రలో నటిస్తున్నాని, ఈ చిత్రంలో తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంతుందని వివరించింది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను త్రినాధరావ్ నక్కిన దర్శకత్వలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు