భరత్ అనే నేను బాగుంది అంటున్న కేటీఆర్
Published on Apr 25, 2018 5:17 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య నిర్మించిన లేటెస్ట్ సెన్సేషన్ మూవీ భరత్ అనే నేను. ఈ నెల 20న విడుదలయిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలయిన అన్ని చోట్ల కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. అయితే మహేష్ బాబు, కొరటాల శివల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ సినిమా స్పెషల్ షో ని వీక్షించిన తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటీఆర్ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు.

సినిమా చూసిన తరువాత మహేష్ బాబు ను, కొరటాల ను ప్రత్యేకంగా అభినందించిన కేటీఆర్, వారితో కలిసి మీడియా వారితో కాసేపు ముచ్చటించారు. మంచి సోషల్ మెసేజ్ తో కమర్షియల్ హంగులు కలగలిపి రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది….

 
Like us on Facebook