తమన్నాను నొప్పించిన అభిమాని !
Published on Jan 28, 2018 6:56 pm IST

స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఈరోజు ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఒక ప్రముఖ నగల దుకాణం ప్రారతంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు తమ అభిమనా తారను చూసేందుకు అక్కడకు చేరుకున్నారు. సెక్యూరిటీ, పోలీసులు అతి కష్టం మీద జనాలను కంట్రోల్ చేశారు. ఇలాంటి తరుణంలోనే జనం నుండి ఒకరు తమన్నాపై అభ్యంతరకర రీతిలో పాదరక్ష విసిరి నిరసన వ్యక్తం చేశాడు.

అయితే అతను విసిరిన పాదరక్ష తమన్నాకు దూరంగా పడి దుకాణ సిబ్బందిని తాకింది. ఆ చర్యకు తమన్నా కాస్త కంగారుపడి, తన సొంత ఊరు లాంటి హైదరాబాద్లో ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో కొంత నొచ్చుకున్నారట. అభ్యంతరకర రీతిలో నిరసన తెలిపిన అభిమానిని అక్కడి స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నించగా తమన్నా అంటే తనకు చాలా అభిమానమని, ఆమె ఈ మధ్య తెలుగులో సరిగా సినిమాలు చేయడంలేదని, అందుకే అలా చేశానని, దీనికి వేరే కారణాలేవీలేవని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడట. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి అతను చెబుతోంది నిజమేనా లేకపోతే అతని మానసిక పరిస్థితి సరిగా లేదా అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.

 
Like us on Facebook