కృష్ణగారి జన్మదిన కానుకగా ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవం

కృష్ణగారి జన్మదిన కానుకగా ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవం

Published on Apr 1, 2015 2:51 AM IST

Mahesh-Babu
మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ తుదిమెరుగులు దిద్దుకుంటుంది. అలాగే ఈ సినిమాలో నటించనున్న తారాగణం ఎంపిక చేసే పనుల్లో చిత్ర యూనిట్ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నాడు( మే 31న) లాంచ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతదర్శకుడు.

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ తుదిదశకు చేరుకొంది. ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు