అల్లరోడి ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’ ఆడియో రిలీజ్ డేట్

అల్లరోడి ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’ ఆడియో రిలీజ్ డేట్

Published on Sep 26, 2014 7:35 PM IST

Brother-of-bommali
అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమాలో బ్రదర్ కి బెండు తీసే బొమ్మాళి పాత్రలో కార్తీక కనిపించనుంది. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాలో బాలెన్స్ ఉన్న పాటలను కూడా షూట్ చేసారు. షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లరి నరేష్ డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకోగా, మరోవైపు డిటిఎస్ పనులు కూడా జరుగుతున్నాయి.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆడియోని అక్టోబర్ 4న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాని అక్తోమార్ 3 లేదా 4వ వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ మరోసారి మోనాల్ గజ్జర్ తూ రొమాన్స్ చేస్తున్న ఈ సినిమాకి చిన్నికృష్ణ డైరెక్టర్. అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు