డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఈ చిత్రం లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మిక్కీ జే మేయర్ తో ఒక అద్భుతమైన సెషన్ పూర్తి అయ్యింది అని పేర్కొన్నారు. మీ సహనానికి, పనికి ధన్యవాదాలు అని తెలిపారు. మీతో సంగీతాన్ని పంచుకోవడానికి వేచి ఉండలేము అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ను తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.