ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ వస్తున్నా ఈ సినిమా అల్లు అర్జున్ సుకుమార్ ల కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం కాగా ఈ చిత్రం పట్ల మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ తో హిందీ, ఓవర్సీస్ మార్కెట్ లలో భారీ స్థాయిలోనే బిజినెస్ చేసుకుంది.
ఇంకా ఓటిటిలో కూడా రికార్డు బిజినెస్ పుష్ప 2 కి అయ్యినట్టుగా జరిగాయి. అయితే తెలుగు సహా కన్నడ, మళయాలంలో కూడా సాలిడ్ బిజినెస్ ఈ చిత్రానికి జరిగినట్టుగా టాక్ ఉంది కానీ ఒక్క తమిళ్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో ఈ చిత్రానికి బిజినెస్ కానట్టే తెలుస్తుంది. జెనరల్ గా తమిళ్ ఆడియెన్స్ ఇతర భాషలు సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచరు అని తెలిసిందే.
రీసెంట్ గా పుష్ప ఫస్ట్ సింగిల్ నే అందుకు పెద్ద ఉదాహరణ. అన్ని భాషల్లో సాంగ్ కి ప్రేక్షకులు మాసివ్ రెస్పాన్స్ ఇస్తే ఒక్క తమిళ్ వెర్షన్ 1 మిలియన్ అందుకోడానికి చాలా సమయం తీసుకుంది. దీనితో తమిళ్ లో మాత్రం పుష్ప 2 కి లిమిటెడ్ గానే బిజినెస్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పైగా మరోపక్క కొందరు బయ్యర్లు పుష్ప 2 మేకర్స్ కోట్ చేస్తున్న భారీ ధర ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తున్నారు అని రూమర్స్ ఉన్నాయి. సో ఇది దాదాపు తమిళ్ వెర్షన్ విషయంలోనే కావచ్చు.