రేపు ఢిల్లీ లో చిరును పద్మ విభూషణ్ తో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం!

రేపు ఢిల్లీ లో చిరును పద్మ విభూషణ్ తో సత్కరించనున్న కేంద్ర ప్రభుత్వం!

Published on May 8, 2024 5:56 PM IST


మెగాస్టార్ చిరంజీవి తన నటనతో, ప్రతిభతో ఎంతో మందికి మార్గదర్శి గా మారారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. రేపు ఢిల్లీ లో చిరును పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించనుంది. ఈ ప్రత్యేకమైన వేడుక కి మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా, సురేఖ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మరియు ఉపాసన గారు కూడా హాజరు కానున్నారు.

ఇది మెగా ఫ్యామిలీ కి ప్రత్యేకమైన వేడుక అని చెప్పాలి. చిరుకి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తదుపరి బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ తో విశ్వంభర చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు