లేటెస్ట్…ఓటిటి లోకి వచ్చేసిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

లేటెస్ట్…ఓటిటి లోకి వచ్చేసిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

Published on May 8, 2024 8:00 PM IST

అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో, డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహ వీడియో లోకి ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎంవీవీ సినిమా మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లపై ఎంవీవీ సత్య నారాయణ మరియు GV లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు