మరో మూడు వారాలు బన్నీ షూటింగ్ కు దూరం !

మరో మూడు వారాలు బన్నీ షూటింగ్ కు దూరం !

Published on Dec 3, 2016 9:00 AM IST

allu-arjun
యంగ్ స్టార్ హీరోల్లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్ ఈ మధ్యే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతొ ఒక సినిమాని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మంచి స్పీడ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ బన్నీ ఇప్పుడు పెద్ద బ్రేక్ ఇచ్చాడని సమాచారం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆయనకు పాప పుట్టింది. ఆ పాపతో, కుటుంబ సభ్యులతో కాస్త ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకుని బన్నీ ఈ బ్రేక్ ప్రకటించాడట.

ఈ బ్రేక్ సుమారు మూడు వారాలు ఉంటుందని, పాపకు పేరు పెట్టిన తరువాతే బన్నీ షూటింగ్ కు తిరిగి వస్తాడని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే సీనియర్ నటుడు రావు రమేష్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. టైటిల్ లోనే వైవిధ్యం నింపుకున్న ఈ చిత్రం యొక్క కథ, కథనాలు కూడా భిన్నంగా ఉంటాయని చెబుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు