రామ్ చరణ్, బోయపాటి సినిమాకు ముహుర్తం కుదిరిందా !
Published on Nov 8, 2017 11:22 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న ‘రంగస్థలం 1985’ పూర్తికాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మంచి మాస్ ఫాలోయింగ్ కలిగిన చరణ్, మాస్ ఎంటరటైనర్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో మొదటిసారి పనిచేయనుండటంతో ఔట్ ఫుట్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇకపోతే ప్రస్తుతం పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ నవంబర్ 20 న లాంచ్ అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ వార్తపై అటు చరణ్ నుండి కానీ, ఇటు బోయపాటి నుండి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదలచేయాలనే ఆలోచనలు జరుగుతున్నాయట. ఇకపోతే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండటమే గాక కొత్తగా ఉంటుందని, చరణ్ సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

 
Like us on Facebook