ఎన్టీఆర్ తన ఉద్దేశ్యాన్ని మార్చుకుంటారా ?

గతేడాది ‘జై లవకుశ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో ఎన్టీఆర్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు త్రివిక్రమ్, తారక్.

కానీ అనిరుద్ అందించిన సంగీతం త్రివిక్రమ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఆశించినంత విజయాన్ని దక్కించుకోలేదు. సినిమా వైఫల్యాల్లో సంగీతం కూడా ఒకటని, పాటల్ని విన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం థియేటర్లో చేసేప్పుడు లేదని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత గొప్ప స్థాయిలో లేదని విమర్శలు వినబడ్డాయి. పవన్ అభిమానులు సైతం అనిరుద్ తెలుగు ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యారంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దీంతో ఎన్టీఆర్ తన ప్రాజెక్టుకు అనిరుద్ ని కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకోవాలనే యోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్ లలో ఎవరు ప్రాజెక్టులో ఉంటారో తెలియాలంటే సినిమా మొదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

 

Like us on Facebook