అంచనాల్ని రెట్టింపు చేసిన రామ్ చరణ్ !


‘ధృవ’ లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో కలిసి చేస్తున్న చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలున్న సంగతి విదితమే. అంతేగాక సినిమా చరణ్ గత చిత్రాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని తెలియడంతో ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా ఏర్పడింది. దానికి తోడు ఎన్ని రోజుల నుండో ఎదురుచూస్తున్న సినిమా టైటిల్ కూడా ప్రకటింపబడటంతో ఆ ఆసక్తి, అంచనాలు రెట్టింపయ్యాయి.

అందుకు కారణం టైటిల్ ‘రంగస్థలం-1985’ అని ఉండటమే. ఎందుకంటే వినడానికి, పలకడానికి చాలా గంభీరంగా ఉన్న ‘రంగస్థలం’ అనే పదాన్ని వింటుంటే 1985ల కాలంలో గ్రామీణ నైపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ఏ స్థాయిలో ఉంటుందో అని ఆలోచన కలుగుతోంది. ప్రతి సినిమాని రియలిస్టిక్ గా, లాజికల్ గా తీసే సుకుమార్ ఇంత బలమైన టైటిల్ పెట్టాడంటే సినిమాలో కూడా బలమైన విషయమే ఉంటుందనే ఊహ కూడా కలుగుతోంది. మొత్తానికి చరణ్ టీజర్, ట్రైలర్ లాంటివి వాటితో కాకుండా కేవలం టైటిల్ తోనే బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇకపోతే సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

 

Like us on Facebook