సెన్సార్‌కు సిద్ధమైన ‘చుట్టాలబ్బాయి’!

సెన్సార్‌కు సిద్ధమైన ‘చుట్టాలబ్బాయి’!

Published on Jul 25, 2016 6:00 PM IST

CHUTTALABBAYI
లవర్ బాయ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న ఆది, తాజాగా ఈసారి కాస్త ఫ్యామిలీ డ్రామాను కూడా మిక్స్ చేసి ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. కామెడీ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరభద్రం చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్ధమైంది. జూలై 30న ఈ సినిమాను సెన్సార్‌కు పంపనున్నట్లు దర్శకుడు తెలియజేశారు. అదేవిధంగా ఆగష్టు 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఆడియో మంచి స్పందనే తెచ్చుకోవడంతో హ్యాపీ అయిన టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తవ్వడంతో రేపట్నుంచే ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టనుంది. వీరభద్రం చౌదరి గత చిత్రాల్లానే ఈ సినిమా కూడా కామెడీ, ఫ్యామిలీ అంశాలను మేళవించుకొని తెరకెక్కిందని సమాచారం. ఆది సరసన నమితా ప్రమోద్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను వెంకట్ తలారి, రామ్ తల్లూరి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు