త్వరలో విడుదలకానున్న విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్ లుక్ !

త్వరలో విడుదలకానున్న విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్ లుక్ !

Published on Mar 19, 2018 2:23 PM IST


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాల్లో నూతన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడ ఉంది. ‘టాక్సీవాలా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ ఇదివరకే విడుదలకాగా ఇప్పుడు ఫస్ట్ లుక్ ను మార్చి 23న విడుదలచేయాలని నిర్ణయించారు. రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో దేవరకొండ సరసన ప్రియాంక జావల్కర్ నటిస్తోంది. ఇకపోతే వవిజయ్ భరత్ కమ్మ, తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ లతో కూడ సినిమాలు చేయనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు