టాక్ : ‘కల్కి 2898’ మొదటి సాంగ్ రిలీజ్ కి రిలీజ్ కి రెడీ ?

టాక్ : ‘కల్కి 2898’ మొదటి సాంగ్ రిలీజ్ కి రిలీజ్ కి రెడీ ?

Published on Apr 27, 2024 12:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ యొక్క న్యూ రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనుండగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని మే రెండవ వారంలో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. భారీ యాక్షన్ హంగులతో పాటు సంగీత పరంగా కూడా కల్కి అందరినీ ఆకట్టుకుంటుందని, సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందని టాక్. మొత్తంగా ఈ భారీ మూవీ ఫై అందరిలో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు