మరో మెగా హీరోకి మ్యూజిక్ ఇవ్వనున్న దేవి శ్రీ !

మరో మెగా హీరోకి మ్యూజిక్ ఇవ్వనున్న దేవి శ్రీ !

Published on Jan 18, 2017 7:49 PM IST

devisri-prasad
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన చేసిన సూపర్ హిట్ సినిమాల జాబితా చాలా పెద్దదే. ఆ జాబితాలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ సినిమాలే ఉంటాయి. ‘ఆర్య, జులాయి, జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, శంకర్ దాదా సిరీస్, సన్ ఆఫ్ సత్యమూర్తి’ తో పాటు వారం క్రితం విడుదలైన ‘ఖైదీ నెం 150’, బన్నీ చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రాలను కూడా కలుపుకుని మొత్తం 15 మెగా సినిమాలకు దేవి సంగీతం అందించాడు. ఈ ఆడియోలన్నీ కూడా సూపర్ హిట్లే.

ఇప్పుడు ఈ లిస్టులో మరో మెగా హీరో సినిమా కూడా చేరనుంది. అదే వరుణ్ తేజ్ త్వరలో ప్రారంభించనున్న కొత్త చిత్రం. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ మెహ్రీన్ కౌర్ ప్రిజాద హీరోయిన్ గా నటిస్తుండగా ‘కత్తి, తేరి’ సినిమాకు పని చేసిన జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న ‘ఫిదా, మిస్టర్’ షూటింగ్లు ఒక కొలిక్కి రాగానే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు