40 కోట్ల మార్కును అందుకున్న రామ్ చరణ్ !

dhruva-3rd
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ధృవ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో ఈ చిత్రం యొక్క 24 రోజుల షేర్ రూ. 40 కోట్ల మార్కును అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మెగా ఫ్యామిలీకి మంచి బలమున్న నైజాం ఏరియాలో 24 రోజుల షేర్ రూ. 15 కోట్లు క్రాస్ చేసింది. ఇలా నైజాం లో 15 కోట్ల మార్కును అందుకోవడం చరణ్ కు ఇది రెండవసారి కావడం విశేషం.

ఇకపోతే యూఎస్ లో విడుదలైన కొద్ది రోజులకే మిలియన్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రానికి 5వ వారంలో ఇంకో 25 స్క్రీన్లను అదనంగా పెంచనున్నారు. అలాగే ఇంకో ఎనిమిది రోజుల పాటు తెలుగులో వేరే చిన్న, పెద్ద సినిమాలు విడుదల లేకపోవడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా మారనుంది. ఈ చిత్ర విజయంతో వరుస పరాజయాల్లో ఉన్న చరణ్ కెరీర్ గాడిలో పడిందనే చెప్పాలి. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో చరణ్ త్వరలో కొత్త సినిమాని మొదలుపెట్టనున్నాడు.

 

Like us on Facebook