విదేశాలకు వెళ్లనున్న జగన్నాథం అండ్ కో !

విదేశాలకు వెళ్లనున్న జగన్నాథం అండ్ కో !

Published on Feb 23, 2017 4:37 PM IST


అల్లు అర్జున్ నటిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ రోజుటి వరకు హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఇక మిగిలిన పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రేపు విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లోని అబుదాబీలో ఈ పాటల షూటింగ్ జరుగుతుంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడం, సినిమాలో బన్నీ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుండటం, పైగా బన్నీ గతేడాది చేసిన చిత్రం ‘సరైనోడు’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ మహాశివరాత్రి సందర్బంగా రేపు ఉదయం 9 గంటలకు విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు