మేము సైతం : కళ్యాణ్ రామ్, బోయపాటి శ్రీను, స్మిత
Published on Oct 15, 2014 6:23 pm IST

kalyanram-srinu
ఒకరి వెంట మరొకరు… మీకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉంది అని భరోసా ఇస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు లక్షల రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. తాజాగా ఈ లిస్టులో నందమూరి కళ్యాణ్ రామ్, బోయపాటి శ్రీను, పాప్ సింగర్ స్మిత, నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ చేరారు.

నందమూరి ఫ్యామిలీ నుండి బాలకృష్ణ, ఎన్టీఆర్ సహాయం అందించగా తాజాగా కళ్యాణ్ రామ్ 10 లక్షలు విరాళంగా సియం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్టు ప్రకటించారు. బోయపాటి శ్రీను 7 లక్షలు, పాప్ సింగర్ స్మిత 2 లక్షల రూపాయలను సియం రిలీఫ్ ఫండ్ కు, మరో 3 లక్షల రూపాయలను స్వచ్చంద సంస్థలకు అందజేస్తున్నట్టు తెలిపారు. ‘అందాల రాక్షసి’ సినిమా హీరోలు రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్రలు చెరో లక్ష విరాళం ఇచ్చారు.

వీరి స్పూర్తితో మరింత మంది తెలుగు హీరోలు, ఇతర ఆర్టిస్టులు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు స్పందించిన తీరు విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించింది.

 
Like us on Facebook