విజయ్ దేవరకొండలోని డిఫరెంట్ యాంగిల్స్ కనబడే చిత్రం !

విజయ్ దేవరకొండలోని డిఫరెంట్ యాంగిల్స్ కనబడే చిత్రం !

Published on Feb 23, 2017 5:56 PM IST


‘పెళ్లి చూపులు’ అనే ఒక్క చిత్రంతో నాలుగైదు సినిమాలు క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ద్వారక’ విడుదలకు సిద్దమయింది. శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ఈ చిత్రం గత సంవత్సరం ఆఖరున విడుదలవాల్సి ఉండగా కరెన్సీ బ్యాన్ వలన వాయిదాపడి మార్చి 3వ తేదీన రిలీజ్ కానుంది. విజయ్ గత చిత్రం ‘పెళ్లిచూపులు’ భారీ విజయం సాధించడం ట్రైలర్, పాటలు బాగుండటంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర చెప్తున్న ప్రకారం ‘పెళ్లి చూపుల్లో’ కేవలం ఒక యాంగిల్ తో మాత్రమే కనిపించిన విజయ్ ఈ సినిమా మాత్రం వివిధ కోణాల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక దొంగగా, ప్రేమికుడిగా, దేవుడిగా, మంచి వాడిగా ఇలా పలు అంశాలు కనిపించేలా విజయ్ పాత్రను డిజైన్ చేశారట. ఆ పాత్రలో విజయ్ చాలా బాగా నటించాడని తెలుస్తోంది. పైగా ఇందులో అతను డ్యాన్సులు, చిన్నపాటి యాక్షన్ స్టంట్లు కూడా చేశాడు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా పూజ జావేరి నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు