ఫస్ట్ డే సౌత్ లో రికార్డ్ సృష్టించిన విజయ్ ‘కత్తి’

ఫస్ట్ డే సౌత్ లో రికార్డ్ సృష్టించిన విజయ్ ‘కత్తి’

Published on Oct 24, 2014 1:30 PM IST

Kaththi
తమిళ స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా నిన్న తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంతో ప్రేక్షకులంతా ఈ దీపావళి సీజన్ లో థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. అంతే కాకుండా కత్తి సినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ సృష్టిస్తోంది.

డైరెక్టర్ మురుగదాస్ మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా అనౌన్స్ చేసాడు. ‘కత్తి’ సినిమా మొదటి రోజు అన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ మొత్తంగా 23.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అందులో తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు నార్త్ ఇండియాతో కలుకొని 16.45 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, మొత్తం ఓవర్సీస్ లో 7.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా కనిపించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది. గతంలో మురుగదాస్ – విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి’ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఈ కత్తి సినిమాని కూడా అక్టోబర్ 31న తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు