‘ఎన్టీఆర్’కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ!

‘ఎన్టీఆర్’కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ!

Published on May 20, 2018 1:08 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు నిన్న,ఈ రోజు పండగ చేసుకుంటున్నారు. నిన్న ఎన్టీఆర్ నటిస్తున్న నూతన చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా నేడు తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడం అలాగే ఎన్టీఆర్ కొత్త సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ కావడం వలన అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

కాగా ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో పెద్ద యెత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కన్నడ స్టార్ సుదీప్,మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అలాగే తెలుగు ఇండస్ర్టీ చెందిన సినీ ప్రముఖులు తమ విషెస్ ను తెలియజేసారు.

ఇలాగే మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 123 తెలుగు తరుపున మరొక్కసారి’ఎన్టీఆర్’కి జన్మదినశుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు