నో చెప్పిన నాగచైతన్య హీరోయిన్ !

నో చెప్పిన నాగచైతన్య హీరోయిన్ !

Published on Nov 21, 2017 11:20 PM IST

హీరోయిన్స్ చాలా మంది బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో బిజీగా ఉంటారు. సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కొన్ని బ్రాండ్స్ కు అంబాసడర్ గా చేసేందుకు కొందరు హీరోయిన్స్ ఇష్టపడరు. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ భామలు ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు ఇప్పటికే రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా నాగ చైతన్య సినిమాలో హీరొయిన్ గా నటిస్తోన్న నిధి అగర్వాల్ ఒక ఫెయిర్ నెస్ క్రీం యాడ్ చెయ్యడానికి నో చెప్పింది. మోడలింగ్ రంగం నుండి వచ్చిన ఈ హీరోయిన్ క్రీం యాడ్ చెయ్యకుండా నో చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగ చైతన్య కు జోడిగా ఈ హీరొయిన్ నటిస్తోండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు