రవితేజ ‘పవర్’లో ఆ మూడు ఇష్టం – హన్సిక

రవితేజ ‘పవర్’లో ఆ మూడు ఇష్టం – హన్సిక

Published on Sep 13, 2014 1:25 PM IST

power
మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘పవర్’లో తన గ్లామర్ పవర్ మరోసారి చూపించింది పాలబుగ్గల చిన్నది హన్సిక. ఈ శుక్రవారం విడుదలైన ‘పవర్’కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. హన్సిక నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉంది హన్సిక. సినిమాలో తనకు ఇష్టమైన మూడు సన్నివేశాల గురించి చెప్పింది.

‘వినాయకుడి ప్రతిమను రవితేజ చేతిలో పెట్టుకుని వచ్చే ఎంట్రీ సీన్, నిరుపమ పాత్రలో నా ఎంట్రీ, బ్రాహ్మి డాన్సు సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి.’ నాకు దర్శకుడు బాబీ ది బెస్ట్ ఎంట్రీ సీన్ ఇచ్చారు. అని హన్సిక అన్నారు.

కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. రెజినా మరొక హీరోయిన్. తమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు