ఇలియానా కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరు..?

ఇలియానా కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరు..?

Published on Nov 27, 2014 11:13 PM IST

ileana
కమర్షియల్ సినిమాలలో సన్నని నడుమును వయ్యారంగా చూపిస్తూ అందాల ప్రదర్శనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది గోవా బ్యూటీ ఇలియానా. తెలుగులోనూ, హిందీలోనూ ఇలియానాకు గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు లభించింది. కమర్షియల్ సినిమాలలో నటించి బోర్ కొట్టిందో..? లేక నటిగా నిరూపించుకోవాలి అని ఆశ కలిగిందో..? తెలియదు గాని, తాజాగా ఇలియానాకు ఓ కొత్త కోరిక కలిగింది. ఒక్క సినిమాలో అయినా మేకప్ లేకుండా నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. నటనకు అవకాశం ఉన్న పాత్ర లభిస్తే మేకప్ లేకుండా నటించడానికి సిద్దమని ఇలియానా తెలిపింది. మరి ఇలియానా కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరు..? వేచి చూడాలి.

ప్రస్తుతం ఇలియానా హిందీ సినిమాలపై తన దృష్టిని కేంద్రీకరించింది. ఇటీవల ‘హ్యాపీ ఎండింగ్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కథ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి రెడీ అవుతున్న ఈ భామను మేకప్ లేకుండా ప్రేక్షకులు చూడగలరా..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు