ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – అంతర్గతంగా విష్ణులో అద్భుతమైన టాలెంట్ ఉంది.!

ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – అంతర్గతంగా విష్ణులో అద్భుతమైన టాలెంట్ ఉంది.!

Published on Sep 11, 2014 1:45 PM IST

tgv
భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వర్మ సినిమాల్లో విభిన్నత ఎంత కనపడుతూ ఉంటుందో, అదే రీతిలో వివాదాలు కూడా వర్మ క్రియేట్ చేస్తూ ఉంటాడు. వర్మ మంచు విష్ణుతో కలిసి చేసిన రెండవ సినిమా ‘అనుక్షణం’. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వర్మతో కాసేపు ముచ్చటించి పలు విశేషాలు తెలుసుకున్నాం. ఆ వివరాలు మీ కోసం..

ప్రశ్న) ‘అనుక్షణం’ లాంటి ఓ సైకో కిల్లర్ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) నేను మొదటి నుంచి సైకో కిల్లర్ బుక్స్ చదువుతూ వస్తున్నాను. సైకో కిల్లర్స్ కేసులని క్లోజ్ గా స్టడీ చేస్తూ వస్తున్నాను. ఇప్పటూ వరకూ నేను ఈ జోనర్ లో సినిమా చేయలేదు. అందుకే సైకో కిల్లర్ స్క్రిప్ట్ తో సినిమా చేసాను.

ప్రశ్న) విష్ణుని ఎందుకు హీరోగా సెలక్ట్ చేసుకున్నారు.?

స) అందరికీ తెలియనిది ఏమిటి అంటే.. అంతర్గతంగా విష్ణులో సూపర్బ్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని తన గత సినిమాల్లో చూడలేదు. ఆ టాలెంట్ లో కొంత భాగం రౌడీలో చూపించగలిగాను. కానీ ఈ సినిమాలో చేసిన ఫుల్ లెంగ్త్ సీరియస్ పాత్రతో అతనిలోని టాలెంట్ ని మీరు చూస్తారు.

ప్రశ్న) సైకో కిల్లర్ రోల్ ఎవరు చేస్తున్నారు. అతని గురించి చెప్పండి.?

స) నూతన నటుడు సూర్య సైకో కిల్లర్ పాత్ర చేస్తున్నాడు. చాలా బాగా చేసాడు. ఆడియన్స్ ని కూడా తన పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు.

ప్రశ్న) ఈ సైకో కిల్లర్ సినిమా చేయడం కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు.?

స) సైకో కిల్లర్స్ కి సంబందించిన చాలా పుస్తకాలు చదివాను, చాలా డాక్యుమెంటరీస్ చదివాను. ఒక్కసారి స్క్రిప్ట్ కి కావాల్సినవి అన్నీ దొరికాక దాన్ని మన ఇండియన్ నేటివిటీకి సెట్ అయ్యేలా మార్చుకున్నాము.

ప్రశ్న) ఇలాంటి సినిమా చేయడం వల్ల కొత్త తరహా క్రైమ్ ని ప్రజలకి పరిచయం చేస్తున్నామని అనుకోలేదా.?

స) ఈ విషయం నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను.. నేను ఎప్పుడూ రియల్ లైఫ్ లో జరిగిన వాటి నుంచే సినిమాలు చేస్తాను. నాకు తెలిసినంత వరకూ ఇలాంటి సినిమాలను చూసి ఎవరూ స్ఫూర్తిగా తీసుకోరు.

ప్రశ్న) చాలా రోజుల తర్వాత రేవతిని ఈ సినిమాలో తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?

స) రేవతి గారు మంచి నటి అని మన అందరికీ తెలుసు. నాకు కాన్సెప్ట్ ప్రకారం తన లాంటి ఓ సీనియర్ నటి కావాలి. సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అందుకే రేవతిని తీసుకున్నాం.

ప్రశ్న) డిస్ట్రిబ్యూషన్ లో మీరు పరిచయం చేసిన బిడ్డింగ్ ప్రాసెస్ లాంగ్ టైంలో వర్కౌట్ అవుతుందని అంటారా.?

స) అవును.. కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ లోకి రావాలనుకొనే వారికి ఇదొక కొత్త దారి చూపిస్తుంది.

ప్రశ్న) ఇప్పటి వరకూ చాలా జోనర్స్ లో సినిమాలు చేసారు. మరి ఎప్పుడు ఫుల్ లెంగ్త్ లవ్ స్టొరీ తీస్తారు.?

స) చాలా త్వరలోనే.. తెలుగులోనే ఆ లవ్ స్టొరీ చేస్తాను.

ప్రశ్న) ఐస్ క్రీమ్ 2 మరియు ఐస్ క్రీమ్ 3 ఇలా రెడీ అవుతున్నాయి.?

స) ఐస్ క్రీం 2 రెడీ అయిపోయింది. 3 త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమాలన్నీ సింపుల్ కాన్సెప్ట్ తో లో బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలు. ఇలాంటివి ఒక రోజు థియేటర్స్ లో ఆడినా చాలు వాటి బడ్జెట్ వచ్చేస్తుంది.

ప్రశ్న) మేము ఎప్పుడు మీ నుండి ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఆశించవచ్చు.?

స) నవ్వుతూ… నెవర్.. నేను ఎప్పటికీ అలాంటి సినిమా తీయను..

అంతటితో రామ్ గోపాల్ వర్మ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాము..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు