ఇంటర్వ్యూ: రామ్ భీమన – అందరికీ అర్థమయ్యేలా సినిమా తీశాను

ఇంటర్వ్యూ: రామ్ భీమన – అందరికీ అర్థమయ్యేలా సినిమా తీశాను

Published on Mar 9, 2017 6:20 PM IST


దర్శకుడు రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆకతాయి’. ఈ చిత్రంతో ఆశిష్ రాజ్, రుక్సార్ మిర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా రేపు మార్చి 10 శుక్రవారం రిలీజ్ కానున్న సందర్బంగా రామ్ భీమన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ మొదటి చిత్రం ‘హమ్ తుమ్’ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది ?

జ) ‘హమ్ తుమ్’ సినిమా నాది కాదు. అది మధ్యలో ఆగిపోతే నేను టేకప్ చేశాను. లండన్ లో చదువుకునేప్పుడు తెలుగులో కూడా హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగించి భారీ సినిమా తీయాలని కలలు కనేవాడిని. ఆ దిశగా ట్రై చేశా కూడా. అందుకే కాస్త టైమ్ పట్టింది.

ప్ర) ఈ ‘ఆకతాయి’ఎలా ఉంటుంది ?

జ) ఈ కథ మీద ఒకటిన్నర సంవత్సరం పని చేశా. ఎవరికైనా కథ చెబితే ఎలాంటి వంక పెట్టకుండా ఓకే చేప్పేయాలి అన్నట్టు కథని సిద్ధం చేసుకున్నాను. పెద్ద హీరోలకి సరిపోయేలా రాసుకున్నా. హ్యపీగా చదువుకునే ఒక కుర్రాడి జీవితంలోకి ఎలాంటి సస్యలొచ్చాయి, వాటిని అతనెలా హ్యాండిల్ చేశాడు అనేదే సినిమా కథ. ప్రతి 10 నిముషాలకి ఒక సప్రైజ్ ఉంటుంది.

ప్ర) ఆకతాయి సినిమా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు?

జ) సెన్సార్ వాళ్ళు కుడా సినిమా చూశారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. నేను సైకలాజికల్ స్టూడెంట్ కనుక ప్రేక్షకులకు కష్టమైన కథని అర్థమయ్యేలా చాలా సులభంగా చెప్పా.

ప్ర) ఈ కథలోకి రాంకీని ఎందుకు తీసుకుని?

జ ) రాంకీ పాత్రను రాసుకున్నప్పుడు దీనికి ఎవరైన బాగా తెలిసిన వాళ్ళు, అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపించే వాళ్ళు కావాలని అనుకుని రాంకీని తీసుకున్నా. సెకండాఫ్లో అతని పాత్ర చాలా అద్బుతంగా ఉంటుంది.

ప్ర) మణిశర్మ సంగీతం గురించి చెప్పండి?

జ) ఆయన సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. తప్పక సినిమాకి హెల్ప్ అవుతుంది. పాటలకు ఇచ్చిన సంగీతం ఒక ఎత్తైతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండి సినిమాని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్తుంది. ఆయన ఈ సినిమాకి పని చేయడం మాకో పెద్ద ప్లస్ పాయింట్.

ప్ర) అమీషా పటేల్ ఐటం సాంగ్ గురించి చెప్పండి?

జ) అమీషా పటేల్ చేసిన ఐటం సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది మంచి సిట్యుయేషన్లో వచ్చే ఈ పాట కోసమ్ ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తే వెంటనే అమీషా పటేల్ బాగుంటుందని నిర్ణయించి ఆమెను తీసుకున్నాం. ముఖ్యంగా ంఆస్ ఆడియన్సును ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు