ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – నా కెరీర్లో బాగా కష్టమైన పాత్ర ‘చక్కిలిగింత’లో చేసాను.

ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – నా కెరీర్లో బాగా కష్టమైన పాత్ర ‘చక్కిలిగింత’లో చేసాను.

Published on Dec 2, 2014 7:36 PM IST

Sumanth-Ashwin
‘అంతక ముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన మరో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘చక్కిలి గింత’. సుకుమార్ ఫ్రెండ్ వేమా రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ తో కాసేపు ముచ్చటించి ఈ సినిమా గురించిన విశేషాలను తెలుసుకున్నాం. మరి సుమంత్ అశ్విన్ చెప్పిన ‘చక్కిలి గింత’ విశేషాలు మీకోసం..

ప్రశ్న) వరుసగా రెండు హిట్స్ అందుకున్న తర్వాత వస్తున్న ‘చక్కిలిగింత’ రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ బాగా టెన్షన్ పడుతున్నారా.?

స) ఎన్ని సినిమాల అనుభవం ఉన్నా, స్క్రిప్ట్ విన్నప్పుడు, సినిమా తీసేటప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నా ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి సినిమా రిలీజ్ అయ్యేలోపు మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అదే టెన్షన్ లో ఉన్నాను. డిసెంబర్ 5తో ఆ టెన్షన్ తగ్గుతుందని అనుకుంటున్నాను.

ప్రశ్న) ఈ సినిమా కథ విన్నప్పుడు మీరెలా ఫీలయ్యారు.?

స) సుకుమార్ గారు, మా డైరెక్టర్ వేమారెడ్డిగారు మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరి ఐడియాలు చాలా క్రేజీగా ఉంటాయి, అస్సలు రొటీన్ గా ఉండవు. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. మొదటి సారి ఈ కథ వినగానే దీనిలో ఉన్న ఉన్న కంటెంట్ కి ఒక యంగ్ స్టర్ గా వెంటనే కనెక్ట్ అయిపోయాను. వెంటనే కథ ఓకే చేసాను. ఓవరాల్ అయిపోయాక ఫస్ట్ టైం ఫస్ట్ హాఫ్ రషెస్ చూసాక, సినిమా మొత్తం తెలిసిన నాకే ఆ పాయింట్ గురించి ఒక అరగంట సేపు మా ఫ్రెండ్స్ తో కూర్చొని చర్చిస్తే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమా చూసాక కచ్చితంగా యూత్ అంతా ఎక్కువగా చర్చించుకుంటారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?

స) ఇందులో నా పాత్ర పేరు ఆడి.. చాలా మెచ్యూరిటీ ఉంటూ డిఫరెంట్ యాటిట్యూడ్ చూపించే పాత్ర. ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా పాత్ర చాలా కొత్తగా, చాలా క్లిష్టంగా ఉంటుంది. ఫస్ట్ కథ విన్నప్పుడు కొంత అర్థం చేసుకున్నా, ఆ తర్వాత్ ఫోటో షూట్ లో ఇంకాస్త, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేముందు, ఇలా చాలా ప్రిపేర్ అయ్యి ఈ పాత్ర చేసాను. ఇప్పటి వరకూ నా కెరీర్లో బాగా టఫ్ గా అనిపించే పాత్రే ఆడి.

ప్రశ్న) ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో ఎక్కువగా యువతని టార్గెట్ చేసినట్టు ఉన్నారు. మరి ఈ సినిమా కోసం స్ఫూర్తి తీసుకున్న సినిమాలు ఏమన్నా ఉన్నాయా.?

స) ఈ సినిమాకి ఎలాంటి స్ఫూర్తి లేదు, ఏ ఇంగ్లీష్ లేదా కొరియన్ సినిమాల నుంచి కాపీ కొట్టలేదు. ఇది వేమారెడ్డి గారి ఒరిజినల్ ఐడియా, ఒరిజినల్ స్టొరీ. ఈ స్టొరీ చెప్పినప్పుడే వేమారెడ్డి గారు మీరు చాలా ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తుంటారు కదా మరి ఎక్కడన్నా దేనికన్నా స్ఫూర్తి అనిపించిందా అని అడిగాడు.? నిజంగా నాకైతే ఎక్కడా పోలిక అనిపించలేదు.

ప్రశ్న) ‘చక్కిలిగింత’ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు.? ఇంతకీ ఎవరు ఎవరికి చక్కిలిగింత పెట్టనున్నారు.?

స) ఈ సినిమాలో ఇంగ్లీష్ లో వచ్చే అవాయిడ్ గర్ల్స్ అనే ఓ సాంగ్ ఉంటుంది. అందువల్ల అందరూ ఇంగ్లీష్ లో ఓ క్యాచీ టైటిల్ పెట్టేయండి, ఓపెనింగ్స్ బాగా వస్తాయి అన్నారు. కానీ వేమారెడ్డి అండ్ టీం మాత్రం దీనికో క్లాసిక్ టైటిల్ పెట్టాలని ‘చక్కిలిగింత’ అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఎవరు ఎవరకి చక్కిలిగింత పెట్టారు అనేది మీరు సినిమాలోనే చూడాలి.

ప్రశ్న) చక్కిలి గింత సినిమాకి మీ పరంగా మేజర్ హైలైట్ అయ్యే సినిమాలు ఏమిటి.?

స) ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ పెద్ద ప్లస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్ లో జరుగుతుంది. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలూ కూడా ఎంజాయ్ చేస్తారు కానీ హీరో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. వారందరికీ సెకండాఫ్ లో సమాధానం దొరుకుతుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద హైలైట్స్ అవుతాయి.

ప్రశ్న) ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన వేమారెడ్డితో పనిచేయడం ఎలా అనిపించింది.?

స) వేమారెడ్డి గారు చాలా మంచి రైటర్, చాలా బాగా నేరేట్ చేస్తారు. ఈ సినిమాని చెప్పిన దానికంటే చాలా బాగా తీసారు. ఈ మూవీ షూటింగ్ టైంలో సుకుమార్ ఓ మాట అన్నారు, సుమంత్ వేమారెడ్డి నేను రూం మేట్స్, ఆయన ఎప్పుడో డైరెక్టర్ కావాలి కానీ ఇప్పటికి రాసి పెట్టి ఉంది. చెప్పాలంటే నా కన్నా క్రియేటివిటీ, క్రీజీ ఐడియాలు ఆలోచించే వ్యక్తి అని అన్నాడు. ఆయన చెప్పిన విషయాలన్నీ నేను సెట్ లో వేమారెడ్డిలో చూసాను.

ప్రశ్న) మీ సినిమాల విషయంలో ఎంఎస్ రాజు గారి పార్ట్ ఎంత వరకూ ఉంటుంది.? మీ బ్యానర్ లో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తున్నారు.?

స) నేను ప్రతి సినిమా విషయంలో మా నాన్న గారి సలహా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆయన జడ్జ్ మెంట్ ని 100% నమ్ముతాను. కానీ ఆయనే నాకు అనుభవం రావాలని ముందు నన్ను వినమంటాడు, నాకు బాగుందనిపిస్తే ఆయన వింటాడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో మళ్ళీ సినిమాలు మొదలు పెడతాము. ప్రస్తుతం నాన్న స్క్రిప్ట్స్ రాస్తున్నారు.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం నేను దిల్ రాజు గారి బ్యానర్ లో ‘కేరింత’ సినిమా చేస్తున్నాను. అది కాకుండా ‘అంతక ముందు ఆ తరువాత’ నిర్మాత దామోదర ప్రసాద్ గారితో ఓ సినిమా చేస్తాను. దానికి సంబందించిన పూర్తి విషయాలు త్వరలోనే తెలియజేస్తాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, సుమంత్ అశ్విన్ ‘చక్కిలిగింత’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు