కర్ణాటకలో ‘కబాలి’ రికార్డులకే రికార్డు!

కర్ణాటకలో ‘కబాలి’ రికార్డులకే రికార్డు!

Published on May 27, 2016 10:40 PM IST

kabali1
రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ టీజర్‌తో సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ప్రభంజనమే సృష్టించిన ఈ సినిమా, జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్‌తో వచ్చిన రెస్పాన్స్‌తో కళ్ళు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ కోట్లల్లో డబ్బులు వెచ్చించి కబాలి హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ, కబాలి హక్కులను ఇండియన్ సినిమాలో ఏ సినిమా కర్ణాటకలో బిజినెస్ చేయనంత స్థాయి డబ్బులు పెట్టి సొంతం చేసుకుందని తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ అందించిన ఆడియో తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ జూన్ 10వ తేదీ లోపులో విడుదల కానుంది. తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు. ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా రజనీకాంత్ ఇందులో సూపర్ స్టైలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు