హాలీవుడ్ కి కమల్ హాసస్.?

హాలీవుడ్ కి కమల్ హాసస్.?

Published on Feb 10, 2016 8:48 PM IST

kamal-hasan
ప్రపంచ సినిమా పరిశ్రమలో అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ అవార్డు అందుకోవాలని అందరూ ఆశ పడుతుంటారు. పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అందరి మనసుల్లో ఈ కోరిక ఉంటుందన్నది నిజం.

తన చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక ప్రత్యేకత, వైవిధ్యాన్ని చూపించే లోకనాయకుడిగా పేరుపొందిన కమల్ హాసన్ కి కూడా ఈ కోరిక ఉందని ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం చేయనప్పటికీనీ తన మనసులో ఆ కోరిక ఉన్నట్లే ఉందని ఆయన తీసుకున్న స్టెప్ చూస్తే తెలుస్తోంది. అందుకే కమల్ హాసన్ హాలివుడ్ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో తను నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా తన స్నేహితులతో కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కమల్ తన సహ రచయితలతో కథ గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆ మధ్య మరుదనాయగం మళ్లీ మొదలవుతుందని వార్తలు వచ్చినా బడ్జెట్ దృష్ట్యా అది సాధ్యం కాదని కమల్ చెప్పాడు. రెండు మూడు సంవత్సరాలు క్రితం కమల్ హాసన్ ఓ హాలివుడ్ సినిమా చెయ్యనున్నట్లు వార్తలు వచ్చినా అవి కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఈ సారి అయినా ఈ లోకనాయకుడి కోరిక తీరుతుందని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు