ఒక్క రాత్రి కమల్ హాసన్ లైఫ్ లో ఏం జరిగింది.?

ఒక్క రాత్రి కమల్ హాసన్ లైఫ్ లో ఏం జరిగింది.?

Published on Apr 21, 2015 9:53 AM IST

kamal-hasan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ మే డే కానుకగా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అది కాకుండా కమల్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘పాపనాశం’ సినిమాలు కూడా రిలీజ్ కి సిద్దమవుతున్నాయి. ఇదిలా ఉంటే కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే తన తదుపరి సినిమా పనులని కూడా ఫినిష్ చేస్తున్నాడు.

కమల్ హాసన్ ఓ యాక్షన్ థ్రిల్లర్ కథని సిద్దం చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. లేటెస్ట్ గా ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.. ఈ సినిమా మొత్తం ఒకే రాత్రి జరుగుతుందట. కేవలం ఒకే రాత్రి మాత్రమే జరిగే కథ కావడంతో ఈ చిత్ర టీం ఈ సినిమాకి ‘ఒరే ఇరవు’ అనే టైటిల్ ని పెట్టారని సమాచారం. ఒరే ఇరవు అనగా ఒకే రాత్రి అని అర్థం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా కమల్ ఈ సినిమాతో తన సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాజేష్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే కమల్ సరసన హీరోయిన్ గా త్రిషని, మరో కీలక పాత్రకి ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు