ఒప్పుకున్న సినిమాల్ని పూర్తిచేశాకే పాలిటిక్స్ అంటున్న కమల్ !
Published on Nov 7, 2017 4:49 pm IST

కమల్ హాసన్ ఈరోజు జరిపిన ప్రెస్ మీట్లో తన పొలిటికల్ పార్టీ, ప్లానింగ్ గురించి స్పష్టమైన ప్రకటన చేసేశారు. ఇప్పటికే తాను రాజకీయాల్లో ఉన్నానని, దాన్ని అధికారికం చేయడమే మిగిలుందన్న ఆయన పూర్తి రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒప్పుకున్నా సినిమాల్ని ఖచ్చితంగా పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. అంతేగాక ఈ ప్రెస్ మీట్లో ఆయన మైయమ్ విజిల్ అనే యాప్ ను కూడా లాంచ్ చేశారు.

ప్రస్తుతం తను పార్టీని నిర్మించే పనిలో ఉన్నానని, ఇంతకు ముందు అవినీతికి పాల్పడిన వారికి తన పార్టీలో స్థానం ఉండదని, జనవరి నుండి తమిళనాడు మొత్తం పర్యటించి ప్రజల్ని కలుస్తానని అన్నారు. అంతేగాక తన పార్టీకి అభిమానులు విరాళాలిస్తారని తాను చెప్పలేదని, కానీ సామాన్య పౌరులు మాత్రం ఇస్తారని అన్నారు. దీన్నిబట్టి ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘శభాష్ నాయుడు, విశ్వరూపం-2’ వంటి సినిమాలు పూర్తవగానే కమల్ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని స్పష్టమైంది.

 
Like us on Facebook